Arvind Tweet: కవితపై ఎంపీ అర్వింద్ సెటైరికల్ ట్వీట్
ABN , First Publish Date - 2022-12-01T12:59:08+05:30 IST
ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు రావడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (TRS MLC Kavita) పేరు రావడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్(BJP MP Dharmapur Arvind Tweet) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘అయ్యయ్యో... ఇప్పుడు ఎలెక్షన్లో నా మీద ఎవరు వెంటాడి, వేటాడి నిలవడతరు?’’ అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. దీంతో పాటు ఓ వీడియోను కూడా ఎంపీ అర్వింద్ జతచేశారు. కాగా.. ఇటీవల అర్వింద్, కవితల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. అర్వింద్ తనపై వ్యక్తి గత విమర్శలు చేస్తున్నాడని కవిత మండిపడ్డారు. అర్వింద్‌ను చెప్పుతోకొడతానని, తాను ఎక్కడ పోటీ చేసినా వెంటాడి మరి పోటీ చేసి ఓడిస్తానంటూ కవిత సవాలు చేసిన సంగతి తెలిసిందే.