YuvaGalam: 50వ రోజు లోకేష్ పాదయాత్ర ప్రారంభం
ABN , First Publish Date - 2023-03-25T11:06:32+05:30 IST
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 50వ రోజుకు చేరుకుంది.
శ్రీసత్యసాయి జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) 50వ రోజుకు చేరుకుంది. పుట్టపర్తి నియోజకవర్గంలో యువనేత 50వ రోజు యువగళం పాదయాత్ర కొనసాగనుంది. మూడు రోజుల విరామం తరువాత శనివారం ఉదయం పుట్టపర్తి నియోజకవర్గం ఒనుకువారిపల్లి విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు.
అంతకు ముందు ఒనుకువారిపల్లి విడిది కేంద్రంలో సెల్పీవిత్ లోకేష్ (Selfy with Lokesh) కార్యక్రమంలో యువనేత పాల్గొన్నారు. ప్రతీ రోజూ సుమారుగా వెయ్యి మందికి లోకేష్ సెల్ఫీ ఇస్తున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా తనని కలవడానికి వచ్చిన ప్రజలను ఉదయమే కలిసి ఫోటోలు దిగుతున్నారు. లోకేష్ ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే లోకేస్ ఇప్పటి వరకు 625 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.
50వ రోజు పాదయాత్ర వివరాలు..
ఉదయం:
9:00 – ఒనుకువారిపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం
10:00 – గాజులకుంటపల్లిలో రైతులతో సమావేశం
10:55 – వడ్డేపల్లిలో ఎస్టీ సామాజికవర్గ ప్రముఖులతో భేటీ.
11:50 – ఒడిసి గ్రామంలో భోజన విరామం.
2:25 – ఒడిసి నుంచి పాదయాత్ర కొనసాగింపు
2:35 – ఒడిసి ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో మైనారిటీలతో భేటీ.
సాయంత్రం
4:00 – ఒడిసి రెయిన్ బో ఎడ్యుకేషన్ అకాడమీ వద్ద బహిరంగసభలో లోకేష్ ప్రసంగం.
5:45 – మొహమ్మదాబాద్ క్రాస్ వద్ద అమడగూరు స్థానికులు, సత్యసాయి వర్కర్లతో సమావేశం.
6:40 – రామయ్యపేట విడిది కేంద్రంలో బస.