AP Minister: పొత్తుపై బీజేపీ సరిగా స్పందించలేదు ఏమో...! పవన్‌పై పెద్దిరెడ్డి వ్యంగ్య కామెంట్స్

ABN , First Publish Date - 2023-09-14T16:10:53+05:30 IST

వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి ముందుకు వెళ్తానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా పవన్‌పై సెటైర్లు విసిరారు. నిన్నటి వరకు పవన్ బీజేపీతో ఉన్నారని... పొత్తుపై బిజేపి సరిగా స్పందించలేదు ఏమో...! అందుకే అయన టీడీపీతో ఉంటానని తేల్చి చెప్పారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

AP Minister: పొత్తుపై బీజేపీ సరిగా స్పందించలేదు ఏమో...! పవన్‌పై పెద్దిరెడ్డి వ్యంగ్య కామెంట్స్

అనంతపురం: వచ్చే ఎన్నికల్లో టీడీపీతో (TDP) కలిసి ముందుకు వెళ్తానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandrareddy) స్పందించారు. ఈ సందర్భంగా పవన్‌పై సెటైర్లు విసిరారు. నిన్నటి వరకు పవన్ బీజేపీతో (BJP) ఉన్నారని... పొత్తుపై బీజేపి సరిగా స్పందించలేదు ఏమో...! అందుకే అయన టీడీపీతో ఉంటానని తేల్చి చెప్పారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ టీడీపీతోనే ఉన్నారన్నారు. ఎన్ని జెండాలు కలిసినా తమది మాత్రం ఒక జెండానే అని స్పష్టం చేశారు. గతంలో కూడా అన్ని జెండాలకు ఎదురెళ్లి గెలిచామని గుర్తుచేశారు. చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) స్కాంకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారన్నారు. గతంలో సీఎం వైఎస్ జగన్ ఎక్కడా సచివాలయంకు ఒక్కసారి కూడా రాకపోయినా అరెస్ట్ చేశారన్నారు. బాలకృష్ణతో పాటు, వాళ్ళ అల్లుడు, ఇంకెవరైనా కలిసి వచ్చినా కూడా వైసీపీ విజయం తథ్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-14T16:10:53+05:30 IST