Lokesh YuvaGalam: 50వ రోజుకు లోకేష్ పాదయాత్ర... ఈ ప్రాంతం నుంచే యువనేత పాదయాత్ర పున:ప్రారంభం
ABN , First Publish Date - 2023-03-25T09:03:39+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈరోజు పున: ప్రారంభంకానుంది.
శ్రీ సత్యసాయి జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Nara lokesh YuvaGalam Padayatra) ఈరోజు పున: ప్రారంభంకానుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మూడు రోజులు పాటు పాదయాత్ర (YuvaGalam Padayatra) కు విరామం ఇచ్చారు. విరామం అనంతరం 50వ రోజు యువగళం పాదయాత్ర (NaralokeshYuvaGalam)ఈరోజు ఓబుళదేవరచెరువు మండలం ఒనుకువారిపల్లి నుంచి తిరిగి ప్రారంభంకానున్నారు. ఇప్పటి వరకు లోకేష్ 625 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈరోజు ఒనుకువారిపల్లి నుంచి పాదయాత్ర మొదలై రామయ్యపేట వద్ద ముగియనుంది. రాత్రికి రామయ్యపేట విడిది కేంద్రంలో లోకేష్ బస చేయనున్నారు.
నేటి పాదయాత్ర షెడ్యూల్ వివరాలు...
ఉదయం :
9:00 – ఒనుకువారిపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం
10:00 – గాజులకుంటపల్లిలో రైతులతో సమావేశం
10:55 – వడ్డేపల్లిలో ఎస్టీ సామాజికవర్గ ప్రముఖులతో భేటీ
11:50 – ఒడిసి గ్రామంలో భోజన విరామం
2:25 – ఒడిసి నుంచి పాదయాత్ర కొనసాగింపు
2:35 – ఒడిసి ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో మైనారిటీలతో భేటీ
సాయంత్రం :
4:00 – ఒడిసి రెయిన్ బో ఎడ్యుకేషన్ అకాడమీ వద్ద బహిరంగసభలో లోకేష్ ప్రసంగం
5:45 – మొహమ్మదాబాద్ క్రాస్ వద్ద అమడగూరు స్థానికులు, సత్యసాయి వర్కర్లతో సమావేశం
6:40 – రామయ్యపేట విడిది కేంద్రంలో బస.