Atchannaidu: సీఎం జగన్‌పై ఫైర్.. చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్ర
ABN , First Publish Date - 2023-10-05T20:26:10+05:30 IST
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM JAGAN) టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM JAGAN) టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) సంచలన వ్యాఖ్యలు చేశారు.
"మోకాలికి బోడిగుండుకి ముడి వేసేందుకు జగన్ మాఫియా ప్రయత్నం. ఎలక్టోరల్ బాండ్స్‌కి లంచాలకు తేడా దర్యాప్తు సంస్థలకు తెలియకపోవడం ఆశ్చర్యకరం. వైసీపీకి వచ్చిన రూ.330.44 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ లెక్క ఏమిటి?. స్కిల్ డెవలప్‌మెంట్‌కి రూ.27 కోట్లు టీడీపీ ఖాతాకు మళ్లాయంటూ దుష్ప్రచారం. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలన్నీ ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంటాయి. ఏప్రిల్ 2023లో టీడీపీ వివరాలను సీఐడీ డౌన్‌లోడ్ చేసుకుంది. అందులో ప్రతి రూపాయి లెక్కా స్పష్టంగా ఉంది. 6 నెలల పరిశోధన తర్వాత కూడా రూపాయి అవినీతి గుర్తించలేకపోయారు. బురద జల్లడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున నిధులు వచ్చాయంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు తలొగ్గి చట్టాలను ఉల్లంఘిస్తున్న దర్యాప్తు సంస్థలు. 2018-19లో ఎలక్షన్ బాండ్ల రూపంలో టీడీపీ ఖాతాకు రూ.27 కోట్లు. అదే సంవత్సరం ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వైసీపీ ఖాతాకు రూ.99.84 కోట్లు,2019-20లో రూ.74.35 కోట్లు, 2020-21లో రూ.96.25 కోట్లు, 2021-22లో రూ.60 కోట్లు ఈ విరాళాల లెక్కల్ని జగన్ రెడ్డి ఎందుకు బయటపెట్టడం లేదు?. చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేసేలా దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ప్రాథమిక హక్కుల్ని కాలరాసేలా ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నాయి. ఎలక్టోరల్ బాండ్స్ సేకరించుకునేందుకు రాజకీయ పార్టీలకు కేంద్రం వెసులుబాటు. కేంద్ర చట్టాలను అపహాస్యం చేస్తూ జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం. చంద్రబాబును అక్రమంగా నిర్బంధించి ఉంచడానికి కుట్ర. న్యాయ వ్యవస్థను సైతం దర్యాప్తు సంస్థలు తప్పుదోవ పట్టిస్తున్నాయి." అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.