AP Budget Session : అసెంబ్లీలో సందడి చేసిన బాలయ్య.. బొత్స, అమర్నాథ్‌లతో సరదా సంభాషణ
ABN , First Publish Date - 2023-03-16T10:14:05+05:30 IST
నేడు ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ సమావేశానికి హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం హాజరయ్యి.. అసెంబ్లీ లాబీల్లో సందడి చేశారు.
అమరావతి : నేడు ఏపీ అసెంబ్లీ (AP Assembly)లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) బడ్జెట్ (AP Budget)ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ సమావేశానికి హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సైతం హాజరయ్యి.. అసెంబ్లీ లాబీల్లో సందడి చేశారు. అసెంబ్లీ లాబీల్లో బాలయ్యను మంత్రులు బొత్స (Botsa Satyanarana), అంబటి (Ambati Rambabu), అమర్నాథ్‌లు పలకరించారు. ఏం హీరో గారు అంటూ బాలయ్యకు బొత్స అభివాదం చేశారు. ఇవాళ కోటు వేసుకు రాలేదేంటంటూ మంత్రి అమర్నాథ్‌ను ఉద్దేశించి బాలయ్య చమత్కరించారు. మొత్తానికి బాలయ్య ఎంట్రీతో అసెంబ్లీలో సందడి వాతావరణం నెలకొంది.
ఏపీ బడ్జెట్ సమావేశం నేడు ప్రారంభమైంది. ముందుగా శాసనసభలో మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ , కుతూహలమ్మ, పాతపాటి సర్రజుతో పాటు మరో ముగ్గురు సభ్యుల మృతి పట్ల సభ సంతాపం తెలుపనుంది. అనంతరం ఉదయం 10 గంటలకు శాసనసభలో 2023- 24 వార్షిక బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajendranath Reddy) ప్రవేశపెట్టనున్నారు. రూ.2.79లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఆపై నున్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి (Minister Nunna Kakani Govardhan Reddy) వ్యవసాయ బడ్జెట్ (Agriculture Budget)ను సభలో ప్రవేశపెడతారు. అటు శాసనమండలిలో ఉదయం 10 గంటలకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా (Deputy CM Anjad Basha) వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా.. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి సిదిరి అప్పలరాజు (Minister Sidiri Appalaraju) మండలి ముందు ఉంచనున్నారు.