AP news : బాలినేనిని సైడ్ చేసి.. విజయసాయిరెడ్డికి ప్రకాశం జిల్లా పగ్గాలు..

ABN , First Publish Date - 2023-07-26T11:13:12+05:30 IST

వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నియామకమయ్యారు. ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, బాపట్ల, నరసరావుపేట జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డిని నియమించారు. ప్రకాశం జిల్లాలో పెత్తనం కోసం నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పదవికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. ప్రకాశం జిల్లా బాధ్యతలు బాలినేనికి అప్పగించకుండా విజయసాయిరెడ్డిని వైసీపీ అధిష్టానం తెరపైకి తెచ్చింది.

AP news : బాలినేనిని సైడ్ చేసి.. విజయసాయిరెడ్డికి ప్రకాశం జిల్లా పగ్గాలు..

ప్రకాశం : వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నియామకమయ్యారు. ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, బాపట్ల, నరసరావుపేట జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డిని నియమించారు. ప్రకాశం జిల్లాలో పెత్తనం కోసం నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పదవికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. ప్రకాశం జిల్లా బాధ్యతలు బాలినేనికి అప్పగించకుండా విజయసాయిరెడ్డిని వైసీపీ అధిష్టానం తెరపైకి తెచ్చింది.


బాలినేని (Balineni) స్థానంలో కీలక నేతను (Key Leader) సీఎం వైఎస్ జగన్ (YS Jagan) నియమించారు. రాజకీయాల్లో ఆరితేరిన ఆయన అయితేనే ఈ పదవికి కరెక్ట్‌గా సెట్ అవుతారని జగన్ రెడ్డి (Jagan Reddy) భావించినట్టున్నారు. కాగా.. జగన్ రెడ్డి సమీప బంధువైన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) వైసీపీలో అసంతృప్తితో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ప్రకాశం (Prakasam), నెల్లూరు (Nellore), చిత్తూరు (Chittor) జిల్లాల కో-ఆర్డినేటర్‌గా (Co-Ordinator) బాలినేని రాజీనామా (Balineni Res) చేయడం అప్పట్లో పెను సంచలనమే అయ్యింది. ఆ మధ్య ఆయనకు మళ్లీ మునుపటి రోజులొచ్చాయని.. ఇక అన్నీ మొదలెట్టేశారని వార్తలు వినిపించినప్పటికీ అవన్నీ రూమర్స్‌కే పరిమితం అయ్యాయి.

అలా వార్తలు వచ్చిన మరుసటిరోజే బాలినేని ఫ్లెక్సీలో వైఎస్ జగన్‌తో పాటు జిల్లా మంత్రులు ఎవరి ఫొటోలు కనిపించపోవడం.. కార్యకర్తలను జగన్ సరిగ్గా పట్టించుకోవట్లేదని ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో బాలినేని ఇంకా కూల్ అవ్వలేదని వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి. అయితే.. బాలినేని రాజీనామా చేసిన కో-ఆర్డినేటర్ పదవికి వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని (YSRCP MP Vijayasai Reddy) నియమించారు. వైఎస్ జగన్‌ నమ్మే అతి కొద్ది మందిలో సాయిరెడ్డి మొదటి వ్యక్తని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయి. పైగా రాజకీయంగా ఆయనకు అపార అనుభవమే ఉందని.. వీటన్నింటికీ మించి ఎలాంటి నేతల మధ్య విబేధాలున్నా ఒకట్రెండు సమావేశాలతోనే కలిపేసే సత్తా కలిగి ఉన్న నేత అని అభిమానులు, అనుచరులు చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఈయనైతేనే ఈ మూడు జిల్లాల ఎమ్మెల్యేలు, ద్వితియ శ్రేణి నేతలను సమన్వయం చేసుకోగలరని సీఎం విశ్వసిస్తున్నారట. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి చేతికి జగన్ ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, బాపట్ల, నరసరావుపేట జిల్లాల పగ్గాలిచ్చేశారు.

Updated Date - 2023-07-26T11:34:33+05:30 IST