Sadhineni Yamini: విజయసాయికి బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా?
ABN , First Publish Date - 2023-11-08T12:13:43+05:30 IST
వైసీపీ నాయకులు దోపిడీ చేస్తూ నీతులు చెబుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామినీశర్మ విమర్శించారు.
విజయవాడ: వైసీపీ నాయకులు (YCP Leaders) దోపిడీ చేస్తూ నీతులు చెబుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామినీశర్మ (BJP Spokesperson Sadhineni Yamini Sharma) విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి (Vijayasaireddy) గురివింద గింజ మాటలు మానుకోవాలని హితవుపలికారు. బీజేపీ (BJP), తమ అధ్యక్షురాలి గురించి మాట్లాడటానికి సిగ్గుండాలని మండిపడ్డారు. వైసీపీ నాయకులంటే డైవర్షన్ పాలిటిక్స్‌కు పెట్టింది పేరన్నారు. జగన్మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) అవినీతిని ప్రశ్నిస్తే బీజేపీ అధ్యక్షురాలిపై విమర్శలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యంతో పేదలు చనిపోయింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మైనింగ్, ఇసుక ద్వారా కోట్లు దోచుకున్నది నిజం కాదా అని నిలదీశారు. కేంద్రం నిధులు ఇస్తే ఆ పధకాలకు తమ పేర్లు పెట్టుకున్నారని.. చెత్త నుంచి మరుగుదొడ్ల వరకు పన్నులు వసూళ్లూ చేస్తున్నారని విమర్శించారు. విద్యుత్ బిల్లులతో పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు.
మా అధ్యక్షురాలిపై వ్యక్తిగత విమర్శలు చేస్తారా?...
‘‘మీ చేతకాని పాలనతో దేశంలోనే రాష్ట్రం పేరు చెడగొట్టారు. ఎన్నికలలో ఓట్ల కోసం నోటికొచ్చిన హామీలు ఇచ్చారు. మీ మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. నాలుగున్నరేళ్లల్లో అభివృద్ధి ఎంత చేశారో చెప్పే ధైర్యం ఉందా. మీ అవినీతి గురించి పెద్ద చిట్టా చెబుతున్నాం... చర్చకు రండి. సమాధానం చెప్పలేక మా అధ్యక్షురాలి పై వ్యక్తిగత విమర్శలు చేస్తారా. విజయసాయి రెడ్డి, మంత్రులకు బుర్ర ఉండే మాట్లాడుతున్నారా. జగన్మోహన్ రెడ్డి వారితో మాట్లాడిస్తున్నారా. విజయసాయి రెడ్డి ఎవరో తెలియక ముందే పురంధరేశ్వరి ఎంపీ అయ్యారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు దోచుకున్న చరిత్ర జగన్ ది, ఎన్టీఆర్ సీఎంగా ఉన్నా... ఒక్క అవినీతి మచ్చ మా నాయకురాలి మీద లేదు. బీజేపీ అడిగిన వాటికి సమాధానం చెప్పే దమ్ము ఉందా. పైగా బెదిరించేలా మా మహిళా నేతపై వ్యాఖ్యలు చేస్తారా. మీకు చిత్తశుద్ధి ఉంటే అవినీతి చేయలేదని చెప్పండి. మీ నిజాయితీ నిరూపించుకునే ధైర్యం ఉందా. ఇంకోసారి నోరు పారేసుకుంటే .. మా మహిళలమే విజయసాయి రెడ్డికి తగిన బుద్ధి చెబుతాం’’ అంటూ సాధినేని యామినీశర్మ హెచ్చరించారు.