Botsa Satyanarayana : అమిత్ షా చెప్పేవరకు తెలియదా? ఏపీ అవినీతిపై బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-06-14T12:45:57+05:30 IST

కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పేవరకూ ఎంపీ జీవీఎల్‌కు రాష్ట్రంలో అవినీతి గురించి తెలియదా? అని విద్యా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఇంతకాలం జీవీఎల్ ఎందుకు ప్రశ్నించలేదో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను అమిత్ షా, జీవీఎల్ మాట్లాడారని అర్ధమవుతోందన్నారు. గురివింద గింజల్లా తమ కింద మచ్చను బీజేపీ నేతలు చూసుకోవాలని బొత్స సూచించారు.

Botsa Satyanarayana : అమిత్ షా చెప్పేవరకు తెలియదా? ఏపీ అవినీతిపై బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి : కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పేవరకూ ఎంపీ జీవీఎల్‌కు రాష్ట్రంలో అవినీతి గురించి తెలియదా? అని విద్యా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఇంతకాలం జీవీఎల్ ఎందుకు ప్రశ్నించలేదో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను అమిత్ షా, జీవీఎల్ మాట్లాడారని అర్ధమవుతోందన్నారు. గురివింద గింజల్లా తమ కింద మచ్చను బీజేపీ నేతలు చూసుకోవాలని బొత్స సూచించారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ పరిస్థితి ఏంటో బీజేపీ నేతలు పరిశీలించుకోవాలన్నారు. ప్రధానితో తమ బంధం ఎలా ఉందో అమిత్‌ షాతోనూ అలానే ఉందన్నారు. ఒకరితో ఎక్కువ, మరొకరితో తక్కువ లేవన్నారు.

కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యలపై తనను ఆడగొద్దని బొత్స పేర్కొన్నారు. ఏపీకి అందరితో పాటు రెండు వందే భారత్ రైళ్లు ఇవ్వటం తప్ప బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. ఇంకా బొత్స మాట్లాడుతూ.. ‘‘9 ఏళ్ల తర్వాత రెవెన్యూ లోటు నిధులు ఇచ్చి ఏదో ఉద్ధరించామంటే ఎలా ? వడ్డీతో సహా చూస్తే ఇంకా ఎక్కువే రావాలి. గతంలో బీజేపీ నుంచి మాకున్న బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఏంటి? ఇప్పుడు లేనిది ఏంటి? బీజేపీ నుంచి మాకు ఎలాంటి వెన్ను దన్ను ప్రత్యేకంగా లేదు. 2019 ముందు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రత్యేక హోదా కోసం మా ఎంపీలు రాజీనామా చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి.. మా ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడుతున్నారు కాబట్టి మా వ్యూహాలు మాకు వున్నాయి’’ అని తెలిపారు.

Updated Date - 2023-06-14T12:55:51+05:30 IST