YuvaGalamPadayatra: ప్రజలతో సెల్ఫీలు దిగుతూ...ఆప్యాయంగా పలకరిస్తూ.. ముందుకెళ్తున్న లోకేష్

ABN , First Publish Date - 2023-02-11T10:20:06+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 16వ రోజుకు చేరుకుంది.

YuvaGalamPadayatra: ప్రజలతో సెల్ఫీలు దిగుతూ...ఆప్యాయంగా పలకరిస్తూ.. ముందుకెళ్తున్న లోకేష్

చిత్తూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర (Nara Lokesh Yuvagalam Padayatra) 16వ రోజుకు చేరుకుంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఎస్ఆర్ పురం హనుమాన్ టెంపుల్ విడిది కేంద్రం నుంచి యువనేత పాదయాత్ర (LokeshPadayatra)ను ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభించే ముందు సెల్ఫీ విత్ లోకేష్ (Selfie With Lokesh) కార్యక్రమం నిర్వహించారు. ప్రతీ రోజు సుమారుగా 1000 మందికి పైగా క్యాంప్ సైట్ వద్ద లోకేష్ సెల్ఫీలు ఇస్తున్నారు. ప్రతిరోజు తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని కలిసి యువనేత సెల్ఫీలు దిగుతున్నారు. యువనేత ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సెల్ఫీ కార్యక్రమానంతరం యాదవ కులస్తులతో లోకేష్ (YuvaGalam) సమావేశమయ్యారు. అనంతరం హనుమాన్ టెంపుల్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం యువనేత పాదయాత్ర(YuvaGalam Padayatra)ను మొదలుపెట్టారు.

రీబిల్డ్ ఏపీ పేరుతో పునర్నిర్మాణం చేస్తాం....

బెంగుళూరులో స్థిరపడిన గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన వ్యాపారస్తులతో లోకేష్ (Nara Lokesh) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ (NaraLokeshForPeople) మాట్లాడుతూ... సైకో పోయి, సైకిల్ వచ్చిన వెంటనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని అన్నారు. పెట్టుబడులు పెట్టడానికి అంతా సిద్దంగా ఉన్నారు. బెదిరింపులు, వేధింపులు లేని సైకిల్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఉన్నవనరుల ఆధారంగా ఏ జిల్లాకు ఏ పరిశ్రమలు అవసరమో తమ దగ్గర పక్కా ప్రణాళిక ఉందన్నారు. స్థానిక అవసరాలకు తగట్టుగా పరిశ్రమలు తీసుకొచ్చి స్థానిక యువతకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించడమే టార్గెట్‌గా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించామని... పారిశ్రామికాభివృద్ధిలో ఏపీ నంబర్ 1గా నిలిచిందని యువనేత చెప్పుకొచ్చారు.

జగన్ పాలనలో జే ట్యాక్స్, బెదిరింపుల దెబ్బకి అందరూ ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నారని విమర్శించారు. ఒక్క అమరరాజా వెళ్లిపోవడం వలన దాదాపు 20 వేల మంది రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారన్నారు. టీడీపీ హయాంలో రాయలసీమను ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్ హబ్‌గా తయారు చేశామని తెలిపారు. విశాఖకు ఐటీ కంపెనీలు తీసుకొచ్చామన్నారు. అన్ని జిల్లాల్లో మైక్రో క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. జగన్ దెబ్బకి రాష్ట్రంలో అన్ని రంగాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయని మండిపడ్డారు. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను జగన్ నాశనం చేశారన్నారు. అందుకే టీడీపీ అధికారంలోకి రాగానే రీబిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని చెప్పారు. పరిశ్రమలు, వ్యాపారాలు చేసే వారికి టీడీపీ పాలనలో ఎటువంటి వేధింపులు లేకుండా అన్ని అనుమతులు లభిస్తాయని స్పష్టం చేశారు. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు సమయానికి సబ్సిడీలు అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. .

Updated Date - 2023-02-11T10:20:10+05:30 IST