LokeshYuvaGalam: 29వ రోజు లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ ఇదే...

ABN , First Publish Date - 2023-02-27T09:13:12+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 29వ రోజుకు చేరుకుంది.

LokeshYuvaGalam: 29వ రోజు లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ ఇదే...

చిత్తూరు: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (TDP Leader Nara Lokesh YuvaGalam Padayatra) 29వ రోజుకు చేరుకుంది. లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra)కు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. తమ ప్రాంతానికి వస్తున్న యువనేత (YuvaGalam)కు హారతులతో మహిళలు స్వాగతం పలుకుతున్నారు. యువకులు, పలు సంఘాల నేతలు తమ సమస్యలను లోకేష్‌ (Lokesh YuvaGalam) కు విన్నవించుకుంటున్నారు. టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను తీర్చుతామంటూ ప్రజలకు యువనేత (YuvaGalam) భరోసా ఇస్తూ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు 367.3 కిలోమీటర్ల మేర పాదయాత్ర (Padayatra) చేశారు. నిన్న (ఆదివారం) 13.2 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు చంద్రగిరి నియోజవర్గం (Chandragiri Constituency)చంద్రగిరి మండలం శివగిరి విడిది కేంద్ర నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది.

29వ యువగళం పాదయాత్ర వివరాలు :

ఉదయం:

8:00 - చంద్రగిరి మండలం శివగిరి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

9:15 – శానంబట్ల గ్రామంలో స్థానికులతో మాటామంతీ.

10:20 - పిచ్చినాయుడుపల్లిలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.

10:45 – తొండవాడ బహిరంగసభలో యువనేత ప్రసంగం.

11:45 – తొండవాడలో భోజన విరామం.

12:45 – భోజనవిరామ ప్రాంతంలో స్థానికనేతలతో అంతర్గత సమావేశం.

సాయంత్రం:

3:00 - తొండవాడనుంచి పాదయాత్ర కొనసాగింపు.

4:30 – చంద్రగిరి టవర్ క్లాక్ జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ.

5:05 – చంద్రగిరి నూర్ జంక్షన్ లో స్థానికులతో భేటీ.

6:55 – ఇత్తెపల్లిలో స్థానికులతో మాటామంతీ.

7:45 – మామందూరు విడిది కేంద్రంలో బస.

Updated Date - 2023-02-27T09:13:13+05:30 IST