Amaranatha Reddy: రాజకీయాల్లో పెను మార్పు రాబోతోంది
ABN , First Publish Date - 2023-10-03T21:45:39+05:30 IST
చంద్రబాబు అక్రమ అరెస్టును 5లక్షల మంది ఆంధ్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారని మాజీ మంత్రి అమరనాథరెడ్డి (Amaranatha Reddy) వ్యాఖ్యానించారు.
తిరుపతి: చంద్రబాబు అక్రమ అరెస్టును 5లక్షల మంది ఆంధ్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారని మాజీ మంత్రి అమరనాథరెడ్డి (Amaranatha Reddy) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి జనం ఇళ్ల నుంచి రోడ్లపైకి రావాలి. ప్రశ్నిస్తే కేసులతో ప్రతిపక్షాలను భయపెడుతున్నారు. ప్రజల కోసం జైలుకెళ్లడానికి, ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. టీడీపీ, జనసేన, సీపీఐ కలయికతో రాజకీయాల్లో పెను మార్పు రాబోతోంది. రానున్న ఎన్నికల్లో 150కి పైగా స్థానాలు టీడీపీకే వస్తాయి’’ అని అమరనాథరెడ్డి పేర్కొన్నారు.