Amaranatha Reddy: ఆ మంత్రి.. బ్రోకి రెండు అక్షరాలు కలుపుకుంటే..!
ABN , First Publish Date - 2023-08-03T16:45:54+05:30 IST
వైసీపీ ప్రభుత్వం కేవలం రెండు వేల కోట్లతో అభివృద్ధి చేశామని గొప్పలు చెబుతోంది. ఇరిగేషన్ మంత్రికి పిచ్చి పట్టింది. మంత్రి అన్న విషయం మరచి టీ షర్టులు వేసుకుని కులకడం, డాన్సులు వేసి కులకడం తప్ప మరేమీ లేదు. అర్ధరాత్రిలో మహిళలకు ఫోన్లు చేయడం.. పడుకుని ఉండే ఆడవాళ్లును లేపడంపై ఉండే చిత్తశుద్ధి ఈ ప్రాజెక్టులపైన పెట్టుంటే సంతోషం.
చిత్తూరు: తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాయలసీమలో నీటి ప్రాజెక్టులపై రూ. 12 వేల కోట్ల పెట్టి అభివృద్ధి చేశామని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి (Amaranatha Reddy) తెలిపారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘వైసీపీ ప్రభుత్వం (Ycp Government) కేవలం రెండు వేల కోట్లతో అభివృద్ధి చేశామని గొప్పలు చెబుతోంది. ఇరిగేషన్ మంత్రికి పిచ్చి పట్టింది. మంత్రి అన్న విషయం మరచి టీ షర్టులు వేసుకుని కులకడం, డాన్సులు వేసి కులకడం తప్ప మరేమీ లేదు. అర్ధరాత్రిలో మహిళలకు ఫోన్లు చేయడం.. పడుకుని ఉండే ఆడవాళ్లును లేపడంపై ఉండే చిత్తశుద్ధి ఈ ప్రాజెక్టులపైన పెట్టుంటే సంతోషం. అంబటి రాంబాబు (Ambati rambabu) బ్రో సినిమాపై కామెంట్ చేయడం కన్నా బ్రో అనే అక్షరానికి రెండు అక్షరాలు కలుపుకుంటే ఆ మంత్రిది అదే పని. రేపు పూతలపట్టులో జరిగే చంద్రబాబు కార్యక్రమానికి ఎన్ని అడ్డంకులు కలిగించినా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రుల మాటతీరు వింటుంటే అసభ్యకరంగా ఉంది. టీవీ ఆఫ్ చేసి దాని బదులు జబర్దస్త్ చూడడం మంచిది. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్న శ్రద్ధ.. పాలనపై పెట్టుంటే ప్రజలు ఎంతో అభివృద్ధి చెందివారు.’’ అని సీఎం జగన్కు మాజీ మంత్రి సూచించారు.