Janasena Kiran Royal: చంద్రబాబును అరెస్ట్‌ చేస్తే మంత్రి వేడుకలు చేసుకోవడం దారుణం

ABN , First Publish Date - 2023-09-12T15:42:30+05:30 IST

పవన్ కళ్యాణ్‌ను అన్న అని లోకేష్ పిలవటoతో పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు పుట్టాడా అని వైసీపీ మేయర్ అన్నారు. అలా అయితే జగన్‌ను జగనన్న అనే వారంతా వైఎస్. రాజశేఖర్‌రెడ్డికి పుట్టినట్టు ఒప్పుకుంటారా?

Janasena Kiran Royal: చంద్రబాబును అరెస్ట్‌ చేస్తే మంత్రి వేడుకలు చేసుకోవడం దారుణం

తిరుపతి: వైసీపీ ప్రభుత్వంపై (Ycp Government) జనసేన నేత కిరణ్ రాయల్ (Janasena Kiran Royal) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పవన్ కళ్యాణ్‌ను అన్న అని లోకేష్ పిలవటoతో పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు పుట్టాడా అని వైసీపీ మేయర్ అన్నారు. అలా అయితే జగన్‌ను జగనన్న అనే వారంతా వైఎస్. రాజశేఖర్‌రెడ్డికి పుట్టినట్టు ఒప్పుకుంటారా?, చంద్రబాబు అరెస్ట్‌కు మంత్రి రోజా వేడుకలు చేసుకోవడం దారుణం. జగన్ ఏమైనా నీతిమంతుడా? అతని పైన 30కి పైగా కేసులు ఉన్నాయి. పవన్‌కు కేంద్ర నిఘా వర్గాలు అన్నీ చెబుతాయా అంటూ కామెంట్ చేశారు. జనసేన కేంద్రానికి మిత్రపక్షం కాబట్టి అన్ని చెబుతారు. ఆరు నెలల తర్వాత వైసీపీ ప్యాకప్.. జగన్ లాకప్. రోజా నీతిమంతురాలు అని కాణిపాకంలో ప్రమాణం చేయాలి. అక్రమంగా అర్జించి బంగళాలు, కార్లు కొన్నారు. జనసేన ప్రభుత్వం అధికారంలో వస్తే రోజా ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం.’’ అని తెలిపారు.

Updated Date - 2023-09-12T15:42:52+05:30 IST