TTD: సనాతన ధర్మంపై టీటీడీ పాలకమండలిలో కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2023-09-05T13:27:38+05:30 IST

టీటీడీ పాలకమండలి మంగళవారం ఉదయం సమావేశమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సనాతన ధర్మాన్ని విస్తృత్తంగా వ్యాప్తి చెయ్యాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వెల్లడించారు.

TTD: సనాతన ధర్మంపై టీటీడీ పాలకమండలిలో కీలక నిర్ణయం

తిరుమల: టీటీడీ పాలకమండలి మంగళవారం ఉదయం సమావేశమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (TTD Chairman Bhumana Krunakar Reddy) ఆధ్వర్యంలో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సనాతన ధర్మాన్ని విస్తృత్తంగా వ్యాప్తి చెయ్యాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వెల్లడించారు. చిన్నతనం నుంచే భక్తి భావాని పెంచేలా తిరుమలలో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గోవింద కోటి రాసిన 25 సంవత్సరాల లోపల యువతి, యువకుల కుటుంబానికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని చెప్పారు. 10 లక్షల 1116 సార్లు గోవింద కోటి రాసిన ఓ భక్తుడికి బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు. విద్యార్థిని, విద్యార్థుల్లో ఆధ్యాత్మికత పెంచేలా రాష్ట్రంలో ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలకు 20 పేజీల భగవద్గీత పుస్తకాన్ని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని.. భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యలను కల్పిస్తామని టీటీడీ చైర్మన్ తెలిపారు. 18వ తేదీ ప్రభుత్వం తరుపున సీఎం జగన్ (CM Jagan) స్వామి వారికి పట్టు వస్త్రాలని సమర్పిస్తారన్నారు. ఈ సందర్భంగా 2024 డైరీ, క్యాలెండరులని సీఎం ఆవిష్కరిస్తారని తెలిపారు. అలాగే సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Tamilnadu Minister Udaynidhi Stalin) చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.


టీటీడీ పాలకమండలి నిర్ణయాలు ఇవే..

  • రూ.1.65 కోట్లతో ముంబాయిలో మరో ఆలయ నిర్మాణం.

  • రూ.5.35 కోట్లతో సమాచార కేంద్రం నిర్మాణం. పాలకమండలి సభ్యులే దీన్ని నిర్మిస్తారు.

  • రూ.2 కోట్లతో మూలస్థాన ఎల్లమ్మ ఆలయాన్ని ఆధునీకరణ.

  • రూ.49.5 కోట్లతో టీటీడీ క్వార్టర్స్‌ ఆధునీకరణ.

  • 413 మంది అర్చకులు, పరిచారకులు, పోటు సిబ్బంది పోస్టులు మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదన.

  • పద్మావతి అస్పత్రిలో 300 మంది సిబ్బంది నియామకానికి ఆమోదం.

  • రూ.2.46 కోట్లతో టీటీడీ అస్పత్రుల్లో మందుల కొనుగోలుకు ఆమోదం.

  • రూ.47 వేద అధ్యాపకుల పోస్టులు మంజూరుకీ ఆమోదం.

  • రూ.33 కోట్లతో టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో సౌకర్యాల కల్పనకు నిధులు కేటాయింపు.

  • తిరుపతి రోడ్ల మర్మతులకు రూ.4 కోట్లు కేటాయింపు..

  • రూ.600కోట్ల రూపాయలతో గోవిందరాజ సత్రాల స్థానంలో అచ్యుతం, శ్రీపాదం భవనాలను నిర్మాణం.

Updated Date - 2023-09-05T13:27:38+05:30 IST