NaraLokesh: ముస్లిం ప్రతినిధులతో లోకేష్ ముఖాముఖి.. జగన్ పాలనపై ఆగ్రహం

ABN , First Publish Date - 2023-03-07T11:58:22+05:30 IST

జిల్లాలోని పీలేరు నియోజవర్గంలో 37వ రోజు పాదయాత్రను లోకేష్ మొదలుపెట్టారు.

NaraLokesh: ముస్లిం ప్రతినిధులతో లోకేష్ ముఖాముఖి.. జగన్ పాలనపై ఆగ్రహం

చిత్తూరు: జిల్లాలోని పీలేరు నియోజవర్గంలో 37వ రోజు పాదయాత్ర (YuvaGalam)ను లోకేష్ (TDP Leader) మొదలుపెట్టారు. ఈ సందర్భంగా కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం వద్ద ముస్లీం ప్రతినిధుల ( Muslim representatives)తో యువనేత ముఖాముఖి నిర్వహించారు. బీజేపీ (BJP)తో పొత్తులో ఉన్నప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం (TDP government) లో ఏనాడూ మైనార్టీ (Minority) సోదరులపై దాడులు జరగలేదన్నారు. మైనార్టీలను ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. మైనార్టీల్లో పేదరికం ఉండకూడదు అనే లక్ష్యంతో టీడీపీ (TDP) మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. జగన్ ప్రభుత్వం (Jagan Government) వచ్చిన తరువాత మైనార్టీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ముస్లీంలకు రంజాన్ తోఫా, దుల్హన్, విదేశీ విద్య లాంటి పథకాలు అమలు చేసింది టీడీపీ అని గుర్తుచేశారు. మసీదులు, ఈద్గాల అభివృద్దికి నిధులు కేటాయించామన్నారు. షాదిఖానాలు ఏర్పాటు, ఖబర్‌స్తాన్‌లు అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించింది టీడీపీ అని చెప్పుకొచ్చారు. ఇమామ్‌లు, మౌజామ్లకు గౌరవ వేతనం ఇచ్చామని యువనేత అన్నారు.

జగన్ ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని మోసం చేశారని విరుచుకుపడ్డారు. ఉప మఖ్యమంత్రిగా అంజాద్ బాషా (Deputy Chief MinisterAnjad Basha) ఉండి కూడా మైనార్టీలకు న్యాయం జరగలేదన్నారు. జగన్ (YS Jaganmohan Reddy) రంజాన్ తోఫా, దుల్హన్, విదేశీ విద్య లాంటి పథకాలు రద్దు చేశారని మండిపడ్డారు. మసీదులు, ఈద్గాల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లోన్ ఇవ్వలేదన్నారు. జగన్ (AP CM) పాలనలో మైనార్టీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని.. అబ్దుల్ సలాంను వేధించి కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీదు ఆస్తులు కాపాడుకోవడానికి పోరాడిన ఇబ్రహీంను నడి రోడ్డు మీద చంపేశారన్నారు. హజీరా అనే ముస్లిం యువతిని అత్యాచారం చేసి చంపేశారని... ఏళ్ళు గడుస్తున్నా ఆమె కుటుంబానికి న్యాయం జరగలేదని తెలిపారు. పలమనేరుకు చెందిన మిస్బా అనే అమ్మాయిని వైసీపీ నేత (YCP Leader) వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారన్నారు. డాక్టర్ అవ్వాలని కోరుకున్న మిస్బాని వైసీపీ నేతలు అన్యాయంగా చంపేశారని ఆరోపించారు. ఇన్ని ఘటనలు జరిగితే మైనార్టీ కమిషన్ చైర్మన్ ఈక్బాల్ అహ్మద్ ఖాన్ ఏమి చేశారని.. ఒక్క ఘటనపైన కూడా స్పందించలేదని లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

lokesh-muslims-1.jpg

***************************************************************************

ఇది కూడా చదవండి

YuvaGalam: లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా... ఆ ప్రచారం అంతా ఉత్తిదేనా?

Lokesh YuvaGalam: నేడు లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ ఇదే...



Updated Date - 2023-03-07T11:58:22+05:30 IST