LokeshYuvaGalam: మరోసారి అడ్డంకులు.. నిలుచున్న స్టూల్‌ను లాక్కునే యత్నం

ABN , First Publish Date - 2023-02-09T12:23:17+05:30 IST

టీడీపీ నేత లోకేష్ పాదయాత్రకు పోలీసులు అడుగడునా అడ్డుంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.

LokeshYuvaGalam: మరోసారి అడ్డంకులు.. నిలుచున్న స్టూల్‌ను లాక్కునే యత్నం

చిత్తూరు: టీడీపీ నేత లోకేష్ పాదయాత్ర (TDP Leader Lokesh Padayatra)కు పోలీసులు అడుగడునా అడ్డుంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల లోకేష్ (YuvaGalam Padayatra) ప్రచార వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు తాజాగా లోకేష్ (Nara Lokesh) మాట్లాడే మైక్‌ను లాక్కున్నారు. గురువారం సంసిరెడ్డిపల్లెకు చేరుకున్న లోకేష్ పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లోకేష్‌ (YuvaGalam)ను మాట్లాడనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. మైక్ తీసుకొస్తున్న బాషాపై దాడి చేసి గాయపరిచి మరీ పోలీసులు మైక్ లాక్కున్నారు. లోకేష్ (YuvaGalam Padayatra) నిలుచున్న స్టూల్‌ను కూడా లాక్కునేందుకు ప్రయత్నించారు. పోలీసుల తీరుపట్ల టీడీపీ శ్రేణులు (TDP) భగ్గుమన్నారు. పోలీసులకు టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా లోకేష్ స్టూల్ మీదే నిలబడి నిరసన తెలుపుతున్నారు.

కాగా... డిప్యూటీ సీఎం నారాయణ స్వామి (Deputy CM Narayana Swamy) సొంత నియోజకవర్గం గంగాధరనెల్లూరులో 14వ రోజు లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh YuvaGalam Padayatra) మొదలైంది. దాదాపు ఐదారు కిలోమీటర్లు నడిచిన తర్వాత గంగాధర నెల్లూరు మండలం సంసిరెడ్డిపల్లె వద్దకు పాదయాత్ర చేరుకుంది. అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు హ్యాండ్ మైక్‌ను తీసుకురావాల్సిందిగా కార్యకర్తను లోకేష్ కోరారు. మైక్ తీసుకువెళ్తున్న కార్యకర్తను పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు. ఇక్కడ మాట్లాడేందుకు వీలులేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కార్యకర్త భాషాపై పోలీసులు దాడి చేయడంతో రక్తస్రావమైంది. దీంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు డౌన్‌ డౌన్ అంటూ నిరసన చేపట్టారు. టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్న ప్రాంతంలోనే వారికి మద్దతుగా లోకేష్ స్టూల్ మీద ఎక్కి నిరసనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు ఏదో ఒక ఆవాంతరం నడుమ లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే స్టూల్ కూడా లాగేంసేంత శాడిజంలో జగర్ సర్కార్ ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2023-02-09T14:01:42+05:30 IST