Lokesh Padayatra: 15వ రోజు లోకేష్ పాదయాత్ర మొదలు
ABN , First Publish Date - 2023-02-10T10:23:38+05:30 IST
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది.
చిత్తూరు: టీడీపీ యువనేత నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర (TDP Leader Nara Lokesh YuvaGalam Padayatra)15వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం గంగాధర నెల్లూరు నియోజవర్గంలో రేణుకాపురం విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra)ను మొదలుపెట్టారు. ముందుగా సెల్ఫీ విత్ లోకేష్ (Selfie With Lokesh) కార్యక్రమంలో భాగంగా అభిమానులు, ప్రజలతో యువనేత సెల్ఫీలు దిగారు. తమ అభిమాన నేత ఆప్యాయంగా పలకరిస్తూ సెల్ఫీలు దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సెల్ఫీల అనంతరం బెంగళూరు టీడీపీ (TDP) ఫోరం నేతలతో లోకేష్ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం యువనేత నడక యాత్ర ప్రారంభించారు. కాసేపట్లో గొల్లకండ్రిక గ్రామస్తులతో రచ్చబండ సమావేశంలో లోకేష్ (YuvaGalam Padayatra) పాల్గొంటారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం 10:30 గంటలకు ఎగువ కమ్మ కండ్రికలో రైతులతో మాటమంతీ నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 1:10 గంటలకు కాపుకండ్రికలో బలిజకాపులతో లోకేష్ (Lokesh YuvaGalam Padayatra) భేటీ అవుతారు. సాయంత్రం 5:40 గంటలకు ఎస్ఆర్‌పురం గ్రామస్తులతో లోకేష్ (Nara Lokesh) ముచ్చటించనున్నారు. తిరిగి ఎస్‌ఆర్ పురం హనుమాన్ టెంపుల్‌లో లోకేష్ రాత్రి బస చేయనున్నారు.
కాగా... లోకేష్ పాదయాత్ర (Padayatra)కు పోలీసులు అడుగడుగా అడ్డంకులు సృష్టించేందుకు యత్నిస్తుండటంతో టీడీపీ అధిష్టానం మరింత పకడ్బందీగా పాదయాత్రను ప్రణాళికను రూపొందిస్తోంది. నిన్న గంగాధర నెల్లూరు నియోజకవర్గం సంసిరెడ్డిపల్లెకు పాదయాత్ర చేరుకోగా.. అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాండేందుకు లోకేష్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మైక్‌ను లాక్కున్నారు. అంతేకాకుండా లోకేష్ (TDP Leader) నిలబడిన కుర్చీని కూడా లాగేందుకు యత్నించారు. దీంతో పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు నిరసనగా టీడీపీ శ్రేణులు నిరసనకు దిగారు. ఇదిలా కొనసాగుతుండగానే... చిత్తూరు జిల్లా నర్సంగరాయపేటలో లోకేష్‌పై పోలీసులు మరో కేసును నమోదు చేశారు. పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి లోకేష్‌పై ఇది ఐదో కేసు. పోలీసు ఉన్నతాధికారులే లోకేష్‌పై ఫిర్యాదు చేయడంతో క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. పాదయాత్రకు అనుమతి రద్దు చేసేందుకు పోలీసులు ఈ విధంగా కేసులు నమోదు చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపించారు.