Lokesh Padayatra: 31వ రోజుకు లోకేష్ పాదయాత్ర.. నేటి షెడ్యూల్ వివరాలు

ABN , First Publish Date - 2023-03-01T09:15:03+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 31వ రోజుకు చేరుకుంది.

Lokesh Padayatra: 31వ రోజుకు లోకేష్ పాదయాత్ర.. నేటి షెడ్యూల్ వివరాలు

తిరుపతి: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం (TDP Leader Nara Lokesh) పాదయాత్ర (YuvaGalam Padayatra) 31వ రోజుకు చేరుకుంది. జనవరి 27న పాదయాత్ర ప్రారంభమవగా... ఇప్పటి వరకు 397.3 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర (LokeshYuvaGalam)గా నడిచారు. నిన్న 30వ రోజు 15.8 కిలోమీటర్ల మేర పాదయాత్ర (NaraLokesh) చేశారు. లోకేష్ పాదయాత్రను ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. పెద్ద ఎత్తున టీడీపీ (TDP) కార్యకర్తలు, నేతలు, ప్రజలు పాదయాత్ర (Padayatra)లో పాల్గొంటున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల సమస్యలు వింటూ.. వారికి నేనున్నాంటూ హామీ ఇస్తూ లోకేష్ (Lokesh) ముందుకు సాగుతున్నారు. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం (Chandragiri Constituency గాదంకి టోల్‌గేట్ (పాకాల మండలం) విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది.

లోకేష్ పాదయాత్ర వివరాలు:

ఉదయం:

9:30 – గాదంకి గ్రామంలో కాపు సామాజికవర్గ నేతలతో మాటామంతీ.

10:20 – నేండ్రగుంట వద్ద 400 కి.మీ. పూర్తయిన సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరణ.

10:30 - నేండ్రగుంట గ్రామస్తులతో మాటామంతీ.

11:55 – ఇర్రంగారిపల్లిలో యువతీయువకులతో ముఖాముఖి.

12:55 – ఇర్రంగారిపల్లిలో భోజన విరామం.

2:30 – ఇర్రంగారిపల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.

సాయంత్రం

3:05 - పాకాల గ్రామంతో టైలర్లతో మాటామంతీ.

3:30– పాకాల బస్టాండు వద్ద గ్రామస్తులతో భేటీ.

4:20 – పాకాల పూలమార్కెట్ వద్ద స్థానిక వ్యాపారులతో మాటామంతీ.

4:35 – పాకాల మసీదులో ప్రత్యేక ప్రార్థనలు, మతపెద్దలతో ఆశీర్వచనం.

5:50 – గుమ్మడివారి ఇండ్లు వద్ద విడిది కేంద్రంలో బస

Updated Date - 2023-03-01T09:15:03+05:30 IST