LokeshYuvaGalam: ప్రతిరోజు 1000 మందితో సెల్ఫీ... 14వ రోజుకు లోకేష్ పాదయాత్ర
ABN , First Publish Date - 2023-02-09T09:42:45+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది.
చిత్తూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) ‘‘యువగళం’’ పాదయాత్ర (YuvaGalam Padayatra) విజయవంతంగా ముందుకు సాగుతోంది. అభిమానులు, మహిళలు లోకేష్ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల ఆశీస్సుల నడుమ లోకేష్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. నేడు 14వ రోజు యువనేత పాదయాత్ర (YuvaGalamPadayatra)ను ప్రారంభించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఆత్మకూరు ముత్యాలమ్మ గుడి ఆవరణలోని విడిది కేంద్రం నుంచి పాదయాత్ర మొదలైంది. పాదయాత్ర (Lokesh Padayatra) ప్రారంభించే ముందు సెల్ఫీ విత్ లోకేష్ (Nara Lokesh) కార్యక్రమంలో యువనేత చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రతి రోజు సుమారుగా 1000 మందికి క్యాంప్ సైట్ వద్ద సెల్ఫీలు ఇస్తున్నారు. ప్రతి రోజు తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని కలిసి లోకేష్ సెల్ఫీలు దిగుతున్నారు. యువనేత ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడంపై ప్రజలు ఆనందరం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు ముత్యాలమ్మ గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. అనంతరం 14వ రోజు పాదయాత్ర (Nara Lokesh YuvaGalam Padaytra)ను మొదలుపెట్టారు.
నేటి పాదయాత్ర షెడ్యూల్....
పాదయాత్రలో భాగంగా ఈరోజు ఉదయం కడపగుంటలో ఎస్సీ వర్గీయులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించనున్నారు. 11 గంటలకు మహదేవ మంగళంలో స్థానికులతో మాటామంతీ చేపట్టనున్నారు. అలాగే మధ్యాహ్నం 2:25 గంటలకు జీడీ నెల్లూరు ఐజెడ్ఎం స్కూల్‌లో విద్యార్థులతో లోకేష్ భేటీ అవనున్నారు. సాయంత్రం 5 గంటలకు రంగాపురంలో లోకేష్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈరోజు రాత్రి రేణుకాపురంలో లోకేష్ బస చేయనున్నారు.