Lokesh YuvaGalam: నేడు లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ ఇదే...

ABN , First Publish Date - 2023-03-07T10:02:36+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది.

Lokesh YuvaGalam: నేడు లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ ఇదే...

చిత్తూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Lokesh) ‘‘యువగళం’’ పాదయాత్ర (YuvaGalam Padaytra) జిల్లాలో కొనసాగుతోంది. పీలేరు నియోజకవర్గంలో పాదయాత్ర 37వ రోజుకు చేరుకుంది. ఈరోజు పలు ప్రాంతాల్లో పాదయాత్ర చేయనున్న లోకేష్ (Nara Lokesh)... మైనారిటీలు, విద్యార్థులు, రైతులు, పలువురు గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. పాదయాత్ర (YuvaGalam) మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు లోకేష్ (YuvaGalam Padayatra) 472.7 కిలోమీటర్ల మేర నడిచారు. ప్రతీ రోజు పది కిలోమీటర్లపైనే యువనేత పాదయాత్ర చేస్తున్నారు. స్థానికులు, పలు సామాజిక వర్గాలు, యువకులు, మహిళలతో మాటామంతి నిర్వహిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వైసీపీ (YCP) పాలనలో తాము ఎదుర్కుంటున్న కష్టాలను లోకేష్ ముందు వారు ఏకరువుపెట్టారు. దీంతో నేనున్నానంటూ వారికి లోకేష్ అభయమిస్తూ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు.

నేటి పాదయాత్ర షెడ్యూల్...

ఉదయం

8:00 – కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రంలో మైనారిటీలతో ముఖాముఖి.

9:00 – ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

9:30 – కలికిరి జెఎన్ టియు వద్ద విద్యార్థులతో మాటామంతీ.

11:30 – వాయల్పాడు మండలం వాండ్లపల్లి వద్ద భోజన విరామం.

1:30 – భోజన విరామ స్థలంలో రైతులతో ముఖాముఖి.

సాయంత్రం

3:15 – గంధబోయినపల్లిలో గ్రామస్థులతో మాటామంతీ.

3:45 – బీదవారిపల్లిలో స్థానికులతో భేటీ.

5:00 – చింతపర్తిలతో ఎస్టీలతో సమావేశం.

6:00 – బోయపల్లి క్రాస్ వద్ద చింతపర్తి విడిది కేంద్రంలో బస.

********************************************************************

ఇది కూడా చదవండి..

Naveen Case: పాపం నవీన్.. ప్రేమ వద్దనుకుని చదువు బాట పట్టిన పాపానికి..


Updated Date - 2023-03-07T10:14:45+05:30 IST