Lokesh YuvaGalam: వచ్చేది మేమే... రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం.. పాదయాత్రలో లోకేష్

ABN , First Publish Date - 2023-03-14T13:55:07+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 42వ రోజుకు చేరుకుంది.

Lokesh YuvaGalam: వచ్చేది మేమే... రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం.. పాదయాత్రలో లోకేష్

చిత్తూరు: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం (TDP Leader Nara lokesh YuvaGalam Padayatra) పాదయాత్ర 42వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం తంబళ్లపల్లె నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా మద్దయ్యప్పగారిపల్లి న్యూ మల్చరీ నర్సరీ వద్ద బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో లోకేష్ (YuvaGalam Padayatra) ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. బీసీలపై దాడులు, అట్రాసిటీ, అట్టెంప్ట్ మర్డర్ కేసులు 36 వేల మందిపై పెట్టారని... సిద్దాంతాన్ని నమ్ముకున్నామని, ప్రజల తరపున పోరాడుతామని స్పష్టం చేశారు. వచ్చేది చంద్రబాబు పాలన... తప్పుడు కేసులు ఎత్తివేస్తామన్నారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో అరాచకం సృష్టించారు... వచ్చేది మేమే.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము’’ అని అన్నారు. వడ్డెర్లను ఆదుకుంది ఎన్టీఆర్ (NTR), చంద్రబాబు (Chandrababu) మాత్రమే అని తెలిపారు. పాపాల పెద్దిరెడ్డి గనులు, క్వారీలు కొళ్లగొట్టారని మండిపడ్డారు. బీసీ కార్పొరేషన్ డైరెక్టర్‌లకు జీతాలు లేవని.. కుర్చీలు కూడా లేవన్నారు. జనాభా దామాషాన బీసీలను ఆదుకుంటామని లోకేష్ (Nara Lokesh) హామీ ఇచ్చారు.

కాగా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ (MLC Elections Code) కారణంగా రెండు రోజుల పాటు లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra) కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ కారణంగా జిల్లాలో ఉండరాదంటూ తంబళ్లపల్లె నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేష్‌కు అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను గౌరవిస్తూ లోకేష్ పాదయాత్ర నిలిపివేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. తిరిగి ఈరోజు ఉదయం యువనేత పాదయాత్రను ప్రారంభించారు. ఇప్పటి వరకు లోకేష్ 529.1 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. 42వరోజు పాదయాత్రలో భాగంగా ఈరోజు ఉదయం కంటేవారిపల్లి నుంచి యువనేత పాదయాత్రను ప్రారంభించారు.

ముందుగా కండ్లమడుగు క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీలో పాల్గొన్నారు. ఆపై హార్స్ లీ హిల్స్ క్రాస్ వద్ద పెద్దమాండ్యం మండల ప్రజలతో భేటీ అయ్యారు. కాసేపటి క్రితం మద్దయ్యప్పగారిపల్లి న్యూ మల్బరీ నర్సరీ వద్ద బీసీ సామాజికవర్గీయులతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం న్యూ మల్చరీ నర్సరీ వద్ద భోజన విరామం అనంతరం.. భోజన విరామ స్థలంలో మహిళలతో ముఖాముఖి అవనున్నారు. ఆపై మొగసాలమర్రిలో స్థానికులతో మాటామంతీ నిర్వహించనున్నారు. తరువాత కుమ్మరల్లిలో డెయిరీ రైతులతో సమావేశంకానున్నారు. సాయంత్రం 4 గంటలకు నాయనిబావి వద్ద స్థానికులతో భేటీ అవుతారు. రాత్రి నాయనిబావి పంచాయితీ గుట్టపాలెం విడిది కేంద్రంలో లోకేష్ బస చేయనున్నారు.

Updated Date - 2023-03-14T13:55:08+05:30 IST