Somireddy: ఎన్నో పాదయాత్రలు జరిగినా.. ఇలాంటి ఆంక్షలు ఎప్పుడూ చూడలేదు

ABN , First Publish Date - 2023-02-17T10:21:15+05:30 IST

టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Somireddy: ఎన్నో పాదయాత్రలు జరిగినా.. ఇలాంటి ఆంక్షలు ఎప్పుడూ చూడలేదు

తిరుమల: టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (TDP Leader Somireddy Chandramohan Reddy) శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి (Tirumala Srivaru)ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి (కి అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ... పేద గిరిజన కుటుంబాలను కాపాడాలని శ్రీవారిని వేడుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మంచి పరిపాలన అందించాలని శ్రీవారిని ప్రార్ధించానన్నారు. రాష్ట్రంలో ఎన్నో పాదయాత్రలు జరిగినా.. లోకేష్ పాదయాత్ర(Lokesh Padayatra)లో ఉన్నన్ని ఆంక్షలు ఎప్పుడు చూడలేదని అన్నారు. జీవో నెంబర్ 1 పేరుతో పాదయాత్ర (YuvaGalam Padayatra)కి పోలీసులతో అడ్డంకలు సృష్టిస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాదయాత్రకు కొనసాగుతున్న అడ్డంకులు...

కాగా... టీడీపీ నేత లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh YuvaGalam) కు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. నిన్న సత్యవేడు నియోజవర్గంలో పలు ప్రాంతాలో లోకేష్ పాదయాత్ర (NaraLokeshForPeople) సందర్భంగా ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లను పోలీసులు తొలగించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధమని పోలీసులు ఈ విధంగా ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా శ్రీకాళహస్తి (Srikalahasti)లో లోకేష్ (Nara Lokesh) పాదయాత్రపై టెన్షన్ నెలకొంది. టీడీపీ నేతలు సూచించిన రూట్ మ్యాప్‌కు పోలీసులు నిరాకరించారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు (Maha Shivratri Brahmotsavam) జరుగుతున్నందున శ్రీకాళహస్తి పట్టణ చతుర్మాడా వీధుల్లోకి పాదయాత్ర (NaraLokesh)కు ప్రవేశం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. నిన్న విడిది చేసిన బైరాజు కండ్రిగ నుంచి తొట్టంబేడు మండలం లక్ష్మీపురం గ్రామం వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. ఇక్కడి నుంచి కొత్త కండ్రిగ, రాజీవ్ నగర్ కాలనీ రామచంద్రపురం బంగారమ్మ కాలనీ మున్సిపల్ కార్యాలయం మీదుగా ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వరకూ పాదయాత్ర జరగనుంది.

ఇక్కడి నుంచి శ్రీకాళహస్తి పట్టణ చతుర్మాడా వీధుల గుండా పంచాయతీ రాజ్ అతిథిగృహం, బీపీ అగ్రహారం, పొన్నాలమ్మ గుడి మీదుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద ఏర్పాటుచేసిన బస ప్రదేశానికి యాత్ర చేరుకునేలా టీడీపీ నేతలు రూట్ మ్యాప్ రూపొందించారు. ఆ మేరకు పోలీసులకు ఎప్పుడో వివరాలను కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు తొలుత సూచించిన రూట్ మ్యాప్‌నకు పోలీసులు అభ్యంతరం తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి కొత్తపేట, తెట్టు, భాస్కర్ పేట వియ్యంపల్లి నుంచి నాయుడుపేట బైపాస్ మీదుగా ఏఎం పుత్తూరు నుంచి బీపీ అగ్రహారం పొన్నాలమ్మ గుడి నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన బస ప్రదేశం వరకూ యాత్ర చేసుకోవాలని పోలీసులు సూచించారు. పాదయాత్రకు అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించడం పట్ల టీపీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

Updated Date - 2023-02-17T10:21:16+05:30 IST