Share News

Tirumala:వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్ష

ABN , Publish Date - Dec 18 , 2023 | 10:02 PM

వైకుంఠ ఏకాదశి ( Vaikuntha Ekadashi ) ఏర్పాట్లపై అధికారులు, అర్చకులతో చర్చించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ( Eo Dharma Reddy ) తెలిపారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 23వ తేదీ వేకువజామున 1.45నిమిషాల నుంచి భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని ప్రారంభిస్తాం. 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.

Tirumala:వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్ష

తిరుమల: వైకుంఠ ఏకాదశి ( Vaikuntha Ekadashi ) ఏర్పాట్లపై అధికారులు, అర్చకులతో చర్చించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ( Eo Dharma Reddy ) తెలిపారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ఈ నెల 23వ తేదీ వేకువజామున 1.45నిమిషాల నుంచి భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని ప్రారంభిస్తాం. 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తాం. జనవరి 1వ తేదీ అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలను మూసివేస్తాం. వీఐపీలు వారి కుటుంబ సభ్యులతో వస్తేనే దర్శనం టికెట్లను కేటాయిస్తాం. ఈ పది రోజుల పాటు సిఫారస్సు లేఖలపై కేటాయించే దర్శనాలను రద్దు చేశాం. తిరుమల్లో వసతి సమస్య ఉంది. వీఐపీలు టీటీడీకి సహకరించి తిరుపతిలో వసతిని పొందాలి. ఈ నెల 22వ తేదీ ఉదయం నుంచి 4.25 లక్షల దర్శన టోకెన్లను భక్తులకు కేటాయిస్తాం. 10 రోజుల టోకెన్ కోటా పూర్తయ్యే వరకు భక్తులకు టోకెన్లను జారీ చేస్తాం. టోకెన్లను పొందిన భక్తులు 24గంటల సమయం ముందే తిరుమలకు రావాలి. దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే గదులు కేటాయిస్తాం. టోకెన్స్ లేని భక్తులు తిరుమలకు రావొచ్చు..కానీ ఆ భక్తులకు శ్రీవారి దర్శనంతో పాటు గదులను కేటాయించం. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణ రథంపై భక్తులకు దర్శనం ఇస్తారు’’ అని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

Updated Date - Dec 18 , 2023 | 11:19 PM