CID: చంద్రబాబు సమాధానాల పత్రాలపై సంతకాలను తీసుకున్న సీఐడీ
ABN , First Publish Date - 2023-09-23T19:58:48+05:30 IST
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి సీఐడీ (CID) అధికారుల బృందం బయటకు వచ్చింది.
రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి సీఐడీ (CID) అధికారుల బృందం బయటకు వచ్చింది. చంద్రబాబుకు (Chandrababu) వైద్య పరీక్షలు పూర్తిచేసి జైలు అధికారులకు సీఐడీ అధికారులు బాబును అప్పగించారు. చంద్రబాబును ప్రశ్నించిన తర్వాత వచ్చిన సమాధానాల పత్రాలపై బాబు సంతకాలను తీసుకున్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు. రేపు ఉదయం 9:30కి తిరిగి రెండో రోజు విచారణ కొనసాగించనున్నట్లు సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తొలిరోజు కస్టడీ ముగిసింది. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబును రెండు రోజుల కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు శనివారం నాడు తొలిరోజు న్యాయవాదుల సమక్షంలో విచారించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులోని కాన్ఫరెన్స్ హాలులో కీలక ఫైళ్లను చంద్రబాబు ముందు ఉంచి ఈ విచారణ చేపట్టారు. సుమారు ఆరు గంటల పాటు ఈ విచారణ సాగినట్లు తెలుస్తోంది. ఉదయం 9:30 గంటలకు సెంట్రల్ జైలుకు వచ్చిన అధికారులు.. ఉదయం 11:30 గంటలకు విచారణ ప్రారంభించారు. ఉద్దేశపూర్వకంగానే విచారణలో జాప్యం చేశారని చంద్రబాబు తరఫు లాయర్లు ఆరోపిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం విచారణ ప్రక్రియను మొదలుపెట్టారు.