Delhi liquor Scam: మాగుంట రాఘవ మధ్యంతర బెయిల్ రద్దు.. జూన్ 12న సరెండర్ అవ్వాలన్న సుప్రీం

ABN , First Publish Date - 2023-06-09T13:30:52+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడు మాగుంట రాఘవ మధ్యంతర బెయిల్ రద్దు అయ్యింది. రాఘవ మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జూన్ 12న సరెండర్ కావాలని రాఘవను సుప్రీం ఆదేశించింది. మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Delhi liquor Scam: మాగుంట రాఘవ మధ్యంతర  బెయిల్ రద్దు.. జూన్ 12న సరెండర్ అవ్వాలన్న సుప్రీం

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడు మాగుంట రాఘవ (Magunta Raghava) మధ్యంతర బెయిల్ రద్దు అయ్యింది. రాఘవ మద్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) రద్దు చేసింది. జూన్ 12న సరెండర్ కావాలని రాఘవను సుప్రీం ఆదేశించింది. మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate(ED)) సుప్రీంలో సవాలు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఈ రోజు విచారణకు రాగా.. రాఘవ మద్యంతర బెయిల్‌ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.

అమ్మమ్మకు అనారోగ్యం కారణంగా రాఘవకు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మధ్యంతర బెయిల్‌ కోసం రాఘవ చూపిన కారణాలు సరైనవి కాదని ఈడీ పేర్కొంది. విచారణకు స్వీకరించాలని ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్ ఏ రాజు ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై ఈరోజు విచారణ జరిపిన సుప్రీం కోర్టు రాఘవకు బెయిల్‌ రద్దు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఫిబ్రవరి 10న రాఘవను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సౌత్ గ్రూప్‌లో కీలక పాత్రధారిగా రాఘవను ఈడీ పేర్కొంది. ఢిల్లీలో పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది. అయితే రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఈడీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Updated Date - 2023-06-12T18:09:01+05:30 IST