Share News

Devineni Uma: ప్రజల భూముల్ని లాక్కునేందుకే నల్ల చట్టం.. జగన్‌పై మాజీ మంత్రి ఆగ్రహం

ABN , Publish Date - Dec 31 , 2023 | 01:42 PM

ప్రజల భూముల్ని లాక్కునేందుకే సీఎం జగన్ నల్ల చట్టాన్ని తెచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. రిజిస్ట్రేషన్, న్యాయ వ్యవస్థలను నిర్వీర్యం చేసి వ్యక్తిగత ఆస్తులను కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Devineni Uma: ప్రజల భూముల్ని లాక్కునేందుకే నల్ల చట్టం.. జగన్‌పై మాజీ మంత్రి ఆగ్రహం

ప్రజల భూముల్ని లాక్కునేందుకే సీఎం జగన్ నల్ల చట్టాన్ని తెచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. రిజిస్ట్రేషన్, న్యాయ వ్యవస్థలను నిర్వీర్యం చేసి వ్యక్తిగత ఆస్తులను కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. సీఎం జగన్ ఉద్దేశపూర్వక సమస్యలు సృష్టిస్తున్నారని, పరిష్కారం చేయాలంటే వాటాలు అడుగుతాన్నారని మండిపడ్డారు. రైతుల భూములు, ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనం ఏంటని ఆయన ప్రశ్నించారు. మరోవైపు టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కూడా జగన్‌పై విమర్శలు చేశారు. జగన్ టికెట్స్ లేవంటే వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు హ్యాపీగా వెళ్లిపోతున్నారని అన్నారు. వైసీపీ బి.ఫామ్ ఎవరికి ఇచ్చినా ఓడిపోతారని.. టీడీపీ, జనసేన బి ఫామ్ వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారని జోష్యం చెప్పారు. ఎలాగూ ఓడిపోతారు కాబట్టి.. సీఎం జగన్ నిర్ణయాన్ని వాళ్ళ కార్యకర్తలు అంగీకరిస్తున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో 2024లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 01:42 PM