Jawahar: చంద్రబాబును కుట్రపూరితంగా జైల్లో పెట్టాలనుకున్నారు.. పెట్టారు
ABN , First Publish Date - 2023-09-13T15:16:34+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిడదవోలు నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది.
తూర్పుగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు (Chandrababu Arrest) నిరసనగా ఆ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిడదవోలు నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. పెరవలి జంక్షన్‌లో నిడదవోలు టీడీపీ ఇన్‌చార్జ్ బూరుగుపల్లి శేషారావు నేతృత్వంలో పార్టీ శ్రేణులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో మాజీ మంత్రి జవహర్ (Former Minister Jawahar) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం కుట్ర పూరితంగా చంద్రబాబు నాయుని జైల్లో పెట్టాలని అనుకున్నారు పెట్టారని అన్నారు. ఈ కేసులో సాక్షాధారాలు ఉన్నాయా?.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారా అనే విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సిన పనిలేదన్నారు. ఎందుకంటే సాక్షాత్తు ముద్దాయి కాని వ్యక్తి అప్రూరర్‌గా మారారు అని చెబుతున్నారని ఆయన అన్నారు.
‘‘సీఎం రమేష్ ఎక్కడా కూడా ముద్దాయిగా చూపించలేదు అలాంటి వ్యక్తి అప్రూర్‌గా మారారు అని చెప్పడం వాళ్లే న్యాయ పరమైన అవగాహన ఏ విధంగా ఉన్నదో అర్థమవుతుంది. ఎటువంటి కాగితాలు లేకుండా నిసిగ్గుగా సుధాకర్ రెడ్డి అరెస్టు చేసిన తర్వాత ఆధారాలు సేకరిస్తామని చెప్పడం దీనిలో అవగాహన లేని వాదన కనబడుతూ ఉన్నది. అవగాహన లేని వ్యక్తులు ఈరోజు రాజ్య అధికారంలో ఉన్నారు. ఏదో ఒక విధంగా కక్ష తీర్చుకోవాలని తప్ప చంద్రబాబు నాయుడు తరపు ఉన్న లాయర్లు అడిగిన సాక్ష్యాలు ఇవ్వడంలో సమాధానం చెప్పే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు అదే విధంగా చంద్రబాబును 16 గంటలు లేదా 16 రోజులైనా జైల్లో ఉంచాలనే కక్ష తప్ప ఆ కేసులో వాస్తవాలు లేవు. ఈ కేసుతో పాటు లేని ఔటర్ రింగ్ అలైన్మెంట్ మార్చారని మరొక కేసు వేయడం దాంతో పాటు మరొక నాలుగు కేసులు వేసి ఏ విధంగా అయినా ఎన్నికల వరకు ఆ సింహాన్ని జైల్లో ఉంచితే ప్రజలందరూ భయభ్రాంతులకు గురై తెలుగుదేశం పార్టీ నామరూప రూపాలు లేకుండా పోతుందని అనే కుట్ర వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం సంక్షోభాలు తెలుగుదేశం పార్టీకి కొత్త ఏమీ కాదు. ఇందిరా గాంధీని ఎదిరించాం, రాజశేఖర్ రెడ్డిని ఎదిరించాం కానీ, ఈ పిల్ల కుంక అవగాహన లేకుండా ప్రజలలో అవహేలన గురికావడానికి ప్రజలలో తేలిక అవడానికి తప్ప ఏ విధమైన సాక్షాదారులు లేని కేసు పెట్టారు. 2021లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ 37 గా ఉన్న వ్యక్తిని A1గా చేస్తారంట ఎందుకంటే తాను కూడా A1 ముద్దాయి కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా A1 చేసి ఇద్దరూ సమానమే అని చెప్పుకోవడానికి. లక్ష కోట్లు దోచుకున్న 43 వేల కోట్ల ఈడీ అటాచ్‌మెంట్‌తో ఉన్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో నీతి పరులందరూ జైలుకు వెళతారు అనే సూత్రం కామన్‌గా ఉండే సూత్రమని. దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ నాయకులు అందరూ చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం పూర్తిగా ఖండిస్తున్నారు. యావత్ భారత్ మొత్తం ఈ అరెస్టును అక్రమ అరెస్టుగా ఖండిస్తూ ఉన్నారు. ప్రజలందరూ గమనించి ఇటువంటి దుర్మార్గమైన వ్యక్తిని మరలా ముఖ్యమంత్రిగా ఎన్నుకోకుండా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని’’ జవహర్ వ్యాఖ్యలు చేశారు.