Pawan Kalyan: చంద్రబాబు కుటుంబ సభ్యులకు జనసేనాని పరామర్శ

ABN , First Publish Date - 2023-09-14T15:52:05+05:30 IST

రాజమండ్రి జైల్లో ములాఖత్ ద్వారా చంద్రబాబును పవన్‌కల్యాణ్, బాలకృష్ణ, లోకేష్ (Nara Lokesh) కలిశారు. దాదాపు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించిన అంశాలపై చర్చకు వచ్చినట్లు తెలిసింది.

Pawan Kalyan: చంద్రబాబు కుటుంబ సభ్యులకు జనసేనాని పరామర్శ

రాజమండ్రి: టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి (Chandrababu Family) జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) అండగా నిలిచారు. కుటుంబ సభ్యులకు బాసటగా నిలబడ్డారు. ఈ మేరకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిని జనసేనాని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.

అంతకముందు రాజమండ్రి జైల్లో ములాఖత్ ద్వారా చంద్రబాబును పవన్‌కల్యాణ్, బాలకృష్ణ, లోకేష్ (Nara Lokesh) కలిశారు. దాదాపు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించిన అంశాలపై చర్చకు వచ్చినట్లు తెలిసింది.

చంద్రబాబుతో భేటీ అనంతరం బయటకొచ్చిన పవన్‌కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. వైసీపీ నుంచి రాష్ట్రాన్ని విముక్తి కలిగించేందుకు టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు జనసేనాని ప్రకటించారు. అనంతరం అందుబాటులో ఉన్న టీడీపీ ముఖ్య నేతలతో పవన్‌కల్యాణ్, లోకేష్, బాలకృష్ణ సమాలోచనలు చేశారు. రేపటి నుంచి ఉమ్మడి కార్యాచరణ ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపై చర్చించారు. ఈ సమావేశంలో చిన్న రాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కళ వెంకటరావు, వంగలపూడి అనిత, పంచుమర్తి అనురాధ, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2023-09-14T15:52:05+05:30 IST