Pitala Sujata: జగన్ చెడ్డీగ్యాంగ్‌తో చంద్రబాబుకు జైల్లో ప్రాణహాని

ABN , First Publish Date - 2023-09-12T16:02:34+05:30 IST

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)ను అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టు చేశారని తెలుగుదేశం సీనియర్ నాయకురాలు పీతల సుజాత(Pitala Sujata) వ్యాఖ్యానించారు.

Pitala Sujata:  జగన్ చెడ్డీగ్యాంగ్‌తో చంద్రబాబుకు జైల్లో ప్రాణహాని

ఏలూరు: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)ను అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టు చేశారని తెలుగుదేశం సీనియర్ నాయకురాలు పీతల సుజాత(Pitala Sujata) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో సుజాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గత తెలుగుదేశం ప్రభుత్వం(Telugu Desam Govt)లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో యువతి యువకులు ఎంతోమందికి శిక్షణ పొందారు. శిక్షణ పొందిన ఎంతోమంది ఉద్యోగాలు సంపాదించారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైలు ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM Jagan Reddy) చెడ్డి గ్యాంగ్ ఏర్పాటు చేసి ఉంటారని మా అనుమానం.. మా నాయకుడుకు ఏదైనా జరిగితే చూస్తూ ఊరుకోం రాష్ట్రమంతా అగ్నిగుండంగా మారుతుది’’ అని పీతల సుజాత హెచ్చరించారు.

Updated Date - 2023-09-12T16:02:34+05:30 IST