Share News

TDP-Janasena: నీట మునిగిన వరి పంటలను పరిశీలించిన టీడీపీ - జనసేన బృందం

ABN , First Publish Date - 2023-12-06T17:24:10+05:30 IST

అనపర్తి నియోజకవర్గం పెదపూడిలో నీట మునిగిన వరి పంటలను టీడీపీ - జనసేన ( TDP-Janasena ) బృందం పరిశీలించింది. పెదపూడి మండలం సంపర - కాండ్రేగుల గ్రామాల పరిధి ఆయకట్టులో మిచౌంగ్ తుఫాన్ వల్ల వర్షాలకు తడిసి పాడైన పంటలను మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జనసేన ఇన్‌చార్జి మర్రెడ్డి పరిశీలించారు.

TDP-Janasena: నీట మునిగిన వరి పంటలను పరిశీలించిన టీడీపీ - జనసేన బృందం

కాకినాడ: అనపర్తి నియోజకవర్గం పెదపూడిలో నీట మునిగిన వరి పంటలను టీడీపీ - జనసేన ( TDP-Janasena ) బృందం పరిశీలించింది. పెదపూడి మండలం సంపర - కాండ్రేగుల గ్రామాల పరిధి ఆయకట్టులో మిచౌంగ్ తుఫాన్ వల్ల వర్షాలకు తడిసి పాడైన పంటలను మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జనసేన ఇన్‌చార్జి మర్రెడ్డి పరిశీలించారు. రోజుల తరబడి నీరు ఉండడంతో పలుచోట్ల వరి పంట కుళ్లిందని చెప్పారు. అన్నదాతలను ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పంట పరిశీలనకు రాకపోవడంపై ప్రశ్నించారు. తక్షణమే తడిసిన ధాన్యాన్ని కొని నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-12-07T21:31:14+05:30 IST