Share News

AP CID: కొలికపూడి సతీమణి మాధవికి నోటీసులు ఇచ్చిన ఏపీ సీఐడీ

ABN , Publish Date - Dec 30 , 2023 | 09:37 PM

ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డా. కొలికపూడి శ్రీనివాస్‌రావు‌ ( Kolikapudi Srinivas Rao ) ను కొలికిపూడి శ్రీనివాసరావు భార్య మాధవికి ఏపీ సీఐడీ అధికారులు. నోటీసులు అందజేశారు. మూడో తేదీ గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

AP CID: కొలికపూడి సతీమణి మాధవికి నోటీసులు ఇచ్చిన ఏపీ సీఐడీ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డా. కొలికపూడి శ్రీనివాస్‌రావు‌ ( Kolikapudi Srinivas Rao ) ను కొలికిపూడి శ్రీనివాసరావు భార్య మాధవికి ఏపీ సీఐడీ అధికారులు. నోటీసులు అందజేశారు. మూడో తేదీ గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 153A, 505(2),506 red with 115,109,120B IPC,& U/S 41b crpc సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రాణ భయంతో ఆర్జీవి తమకు ఫిర్యాదు చేశాడని అందులో భాగంగానే కేసు నమోదు చేశామని ఏపీ సీఐడీ తెలిపింది.

కాగా.. కొలికపూడి శ్రీనివాస్‌రావు‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడీ ప్రత్యేక బృందం శనివారం నాడు హైదరాబాద్‌కి చేరుకున్నది. 8 మంది సీఐడీ అధికారులు నల్లగండ్లలోని అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే కొలికపూడి శ్రీనివాస్‌రావు నివాసానికి చేరుకున్నది. ‘‘అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ నుంచి విజిటర్స్ ఉన్నారని మధ్యాహ్నం నాకు కాల్ వచ్చింది. ఎవరని అడగ్గా సీఐడీ అధికారులమని చెప్పారు. కొలికపూడి శ్రీనివాస్ పేరు మీద నోటీసులు ఉన్నాయి ఇవ్వాలని చెప్పారు. ఇంట్లో ఎవరూ లేరు పాప ఉందని సమాధానం చెప్పాను. పాపకు నోటీసు ఇస్తామని అన్నారు అందుకు నేను వ్యతిరేకించాను.. నోటీస్ ఇవ్వాలి అంటే తాను పనిచేస్తున్న కార్యాలయానికి రావాలని చెప్పాను. నా మాటను బేఖాతరు చేస్తూ అక్రమంగా అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లారు’’ అని కొలికిపూడి శ్రీనివాసరావు భార్య మాధవి తెలిపారు.

Updated Date - Dec 30 , 2023 | 09:37 PM