Atchannaidu: టీడీపీ-జనసేన పొత్తుతో వైసీపీకి పిచ్చెక్కింది
ABN , First Publish Date - 2023-09-16T14:06:19+05:30 IST
స్కిల్ డెవలప్‌మెంట్ ఒప్పందం ఫేక్ అగ్రిమెంట్ అని సీఎం జగన్ ఎలా అంటారు..?, మా దగ్గర అగ్రిమెంట్ కుదుర్చుకున్న డాక్యుమెంట్ ఉంది.. అవసరమైతే జగన్‌కు పంపుతాం. చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టారని ఏదో అంటున్నారు.
అమరావతి: నిడదవోలు సభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) మండిపడ్డారు. ‘‘రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లి పవన్ చంద్రబాబును (Chandrababu) పరామర్శిస్తే వైసీపీ నేతల ప్యాంటు తడిచిపోయింది. పవన్ పొత్తు ప్రకటన చేయగానే సీఎం జగన్ (Cm jagan), మంత్రులు పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారు. పొత్తు ప్రకటన తర్వాత వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదు. పవన్‌తో టీడీపీ (TDP) పొత్తు ఖరారయ్యాక వైసీపీ నేతలు పోటీకి భయపడుతున్నారు.’’ అని వ్యాఖ్యానించారు.
‘‘స్కిల్ డెవలప్‌మెంట్ ఒప్పందం ఫేక్ అగ్రిమెంట్ అని సీఎం జగన్ ఎలా అంటారు..?, మా దగ్గర అగ్రిమెంట్ కుదుర్చుకున్న డాక్యుమెంట్ ఉంది.. అవసరమైతే జగన్‌కు పంపుతాం. చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టారని ఏదో అంటున్నారు. కేబినెట్ మీటింగ్ వెళ్లేటప్పుడు రిజిస్టర్‌లో సంతకం చేసినా తప్పు అనేలా ఉన్నారు. సీఎం, మంత్రుల సంతకం లేకుండా ఫైళ్లు ఉంటాయా..? గతంలో మంత్రులుగా పని చేసిన బొత్స, ధర్మాన వంటి వారు ఇప్పుడు కేబినెట్‌లో కూడా ఉన్నారు.. సంతకాలు పెడతారో లేదో తెలీదా..? తన మీద ఉన్న కేసులకు జగన్ సమాధానం చెప్పగలరా..?, మేం స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించిన వివరాలన్నీ ఆధారాలతో సహా వెబ్‌సైట్ రూపొందించాం. స్కిల్ కేసులో జగన్‌తో చర్చకు సిద్దమని లోకేష్ సవాల్ విసిరారు.. సీఎం సిద్దమా..?, ప్రస్తుతం లోకేష్ ఢిల్లీలో ఉన్నారు.. స్పెషల్ ఫ్లైట్ నీకేం కొత్త కాదుగా.. ఫ్లెటేసుకుని ఢిల్లీ వెళ్లి చర్చలో పాల్గొనగలరా..?, జగన్ ఆస్తుల కేసులో అధికారులను జైలుకు పంపిన పొన్నవోలు.. ఇప్పుడు స్కిల్ కేసులో అధికారులకేం సంబంధం అంటారేంటి.?.’’ అని అచ్చెన్నాయుడు నిలదీశారు.