Chandrababu: కొద్దిసేపట్లో కుంచనపల్లి సిట్ ఆఫీస్‌కు చంద్రబాబు

ABN , First Publish Date - 2023-09-09T15:33:58+05:30 IST

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)ను శనివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబుపై 465,468, 471, 409, 201, 166, 167, 418, 420 సెక్షన్ల కింద సీబీఐ(cbi) కేసులు నమోదు చేసింది.

Chandrababu: కొద్దిసేపట్లో కుంచనపల్లి సిట్ ఆఫీస్‌కు చంద్రబాబు

అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)ను శనివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబుపై 465,468, 471, 409, 201, 166, 167, 418, 420 సెక్షన్ల కింద సీబీఐ(cbi) కేసులు నమోదు చేసింది. చంద్రబాబుతో పాటు CSO, NSG బలగాలు ఉన్నాయి. చంద్రబాబును రిమాండ్‌కు ఇవ్వాలని సీబీఐ కోరింది. కాగా.. తాడేపల్లి మీదుగా కాన్వాయ్ వెళ్తొంది. అయితే కుంచనపల్లిలోని సిట్ ఆఫీస్‌కు పోలీసులు చంద్రబాబును కొద్దిసేపట్లో తీసుకురానున్నారు. కుంచనపల్లి సిట్ ఆఫీస్ సమీపంలో భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు‌ అరెస్ట్‌ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-09-09T15:36:04+05:30 IST