AP NEWS: చంద్రబాబుతో ఉండవల్లి శ్రీదేవి సమావేశం.. పార్టీ మార్పుపై ఏమన్నారంటే..!
ABN , First Publish Date - 2023-08-10T19:33:02+05:30 IST
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు చంద్రబాబును వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి(YCP rebel MLA Undavalli Sridevi) కలిశారు. వారిద్దరు గంటపాటు సమావేశం అయినట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లా: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు చంద్రబాబును వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి(YCP rebel MLA Undavalli Sridevi) కలిశారు. వారిద్దరు గంటపాటు సమావేశం అయినట్లు తెలుస్తోంది. పార్టీ మార్పు, పలు కీలక అంశాలపై చంద్రబాబుతో శ్రీదేవి చర్చించినట్లు సమాచారం. సమావేశం అనంతరం మీడియాతో ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ..‘‘నేను కష్టాలు పడుతున్న సమయంలో.. చంద్రబాబు, లోకేష్(Chandrababu, Lokesh) మద్దతిచ్చారు. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశా. వైసీపీ(YCP) గుండాలు నామీద దాడులు చేశారు. దిశా చట్టం(Disha Law) ఎక్కడ ఉంది...ప్రస్తుతం తెలంగాణ(Telangana)లో ఉంటున్నా. నాకు రక్షణ కల్పించాలని చంద్రబాబుని అడిగా. రానున్న రోజుల్లో ఏ పార్టీ లో జాయిన్ అవుతానో ఆలోచించా.నాలుగున్నర నెలలపాటు ఆలోచన చేశా చంద్రబాబు, జగన్(Jagan Govt) పాలన బేరేజు వేసుకున్నా. నా నిర్ణయం త్వరలో చెప్తా. R5 జోన్(R5 zone)లో ప్లాట్లు ఇవ్వోద్దని ఏపీ హైకోర్టే(AP High Court) చెప్పింది. ఎన్నికలు(Elections) ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు’’ అని ఉండవల్లి శ్రీదేవి తెలిపారు.