Lokesh YuvaGalam: 174వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభం.. రేపు పాదయాత్రకు విరామం
ABN , First Publish Date - 2023-08-03T10:12:06+05:30 IST
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 174వ రోజుకు చేరుకున్నారు.
పల్నాడు: టీడీపీ యువనేత నారా లోకేశ్ (TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) 174వ రోజుకు చేరుకుంది. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో మూడో రోజు పాదయాత్ర కొనసాగుతోంది. గురువారం ఉదయం నగరాయపాలెం క్యాంప్ సైట్ నుంచి 174వ రోజు యువగళం పాదయాత్రను లోకేశ్ ప్రారంభించారు. మరికాసేపట్లో కొండ్రముట్లలో 2300 కిలోమీటర్ల మైలురాయిని లోకేశ్ చేరుకోనున్నారు. 2300 కిలోమీటర్ల మైలురాయికి చేరుకోనున్న సందర్భంగా అక్కడ శిలాఫలకాన్ని యువనేత ఆవిష్కరించనున్నారు. సత్యనారాయణపురం, కొచ్చెర్ల, అంగలూరు మీదుగా వనికుంట వరకూ ఈరోజు పాదయాత్ర సాగనుంది. మధ్యాహ్నం తర్వాత పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. ఈరోజు లోకేశ్ మంగళగిరి వెళ్లనున్నారు. కోర్టు పని కారణంగా ఈనెల 4న (శుక్రవారం) పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. తిరిగి 5 నుంచి యధావిధిగా లోకేశ్ పాదయాత్ర ప్రారంభంకానుంది.