AP High Court: పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ నియామకాల భర్తీపై హైకోర్టుకు ప్రభుత్వం అప్పీల్
ABN , First Publish Date - 2023-11-23T17:16:03+05:30 IST
పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ ( Police Sub-Inspector ) నియామకాల భర్తీకి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సింగిల్ జడ్జి స్టే విధించడంతో డివిజన్ బెంజ్‌కి ఏపీ ప్రభుత్వం ( AP GOVT ) అప్పీల్ చేసింది.
అమరావతి: పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ ( Police Sub-Inspector ) నియామకాల భర్తీకి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సింగిల్ జడ్జి స్టే విధించడంతో డివిజన్ బెంజ్‌కి ఏపీ ప్రభుత్వం ( AP GOVT ) అప్పీల్ చేసింది. ఎంతో పారదర్శకంగా నియామకాలు చేపట్టినా ఫలితాలపై స్టే విధించడం న్యాయబద్ధం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 2019లో ఎత్తు విషయంలో అర్హత సాధించిన వేళాది మంది అభ్యర్థులు 2023లో అనర్హత సాధించడంపై హైకోర్టును అభ్యర్థులు ఆశ్రయించారు.
సుదీర్ఘ వాదనల అనంతరం తుది ఫలితాలపై రాష్ట్ర న్యాయస్థానం సింగిల్ జడ్జి స్టే విధించారు. ఈ అప్పీల్‌ని అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించింది. వేళాదిమంది విద్యార్థుల భవిష్యత్తుపై ఆధారపడి ఉన్న ఈ నియామకాలపై తక్షణమే స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం ధర్మాసనానికి అప్పీల్ చేసింది. ఈ పిటిషన్‌పై రేపు వాదనలు జరిగే అవకాశం ఉంది. పిటీషనర్ల తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించనున్నారు.