AP NEWS: మేయర్ చేతిలో పోలీస్ లాఠీ.. ముదురుతున్న వివాదం

ABN , First Publish Date - 2023-09-11T19:54:21+05:30 IST

చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌కు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఏపీ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే ఈ బంద్‌ను ఆపడానికి వైసీపీ నేతలు(YCP leaders) నానా కుయుక్తులు పన్నారు. కాగా.. గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు(Guntur Mayor Manohar Naidu) పోలీస్ లాఠీ(Police baton) పట్టుకోని శాంతియుతంగా బంద్ పాటిస్తున్న టీడీపీ నేతల(TDP leaders)పై దాడికి దిగారు.

AP NEWS: మేయర్ చేతిలో పోలీస్ లాఠీ.. ముదురుతున్న వివాదం

గుంటూరు జిల్లా: చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌కు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఏపీ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే ఈ బంద్‌ను ఆపడానికి వైసీపీ నేతలు(YCP leaders) నానా కుయుక్తులు పన్నారు. కాగా.. గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు(Guntur Mayor Manohar Naidu) పోలీస్ లాఠీ(Police baton) పట్టుకోని శాంతియుతంగా బంద్ పాటిస్తున్న టీడీపీ నేతల(TDP leaders)పై దాడికి దిగారు. దీంతో ఈ వివాదం నెలకొంది. ప్రస్తుతం ఈ గొడవ మరింతగా ముదురుతోంది. అరండల్‌పేట(Arundalpet) ఘటనపై జిల్లా ఎస్పీకు టీడీపీ ఇన్‌చార్జ్ కోవెలమూడి రవీంద్ర(Kovelamudi Ravindra) సోమవారం నాడు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం కోవెలమూడి రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ..పోలీసుల చేతుల్లో ఉండాల్సిన లాఠీలు వైసీపీ నేతల చేతుల్లోకి ఎలా వచ్చాయో సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీ తక్షణమే దీనిపై స్పందించి చిత్తశుద్ది నిరూపించుకోవాలని కోరారు.144 సెక్షన్ అమలులో ఉండగా మేయర్ మనోహర్ పోలీసుల లాఠీతో తిరగడం పోలీస్‌శాఖకు కనపడదా అని ప్రశ్నిచారు.తెలుగుదేశంలో గెలిచి వైసీపీలో కొనసాగే ఎమ్మెల్యే మద్దాలి గిరి చంద్రబాబు గురించి మాట్లాడం సిగ్గుచేటన్నారు. మేయర్ మనోహర్ నాయుడుకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి కాదన్నారు.చంద్రబాబుకు జరిగిన అన్యాయంపై జనసేన పోరాటానికి సలాం కొడుతున్నామని చెప్పారు. పవన్ కళ్యాణ్‌పై మరోసారి వైసీపీ నేతలు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని వెంటాడి తరుముతామని తీవ్రంగా హెచ్చరించారు.

Updated Date - 2023-09-11T19:55:15+05:30 IST