YuvaGalam: ఈనెల 19న కృష్ణా జిల్లాలోకి లోకేశ్ యువగళం... మూడు రోజులు అక్కడే

ABN , First Publish Date - 2023-08-16T10:48:27+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా దూసుకుపోతోంది. 185 రోజులుగా లోకేశ్ ప్రజల్లో తిరుగుతూ వారి సాదకబాదకాలు వింటూ టీడీపీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం లోకేశ్ గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈనెల 19న మధ్యాహ్నం ఒంటిగంటకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది.

YuvaGalam: ఈనెల 19న కృష్ణా జిల్లాలోకి లోకేశ్ యువగళం... మూడు రోజులు అక్కడే

అమరావతి: టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర (Nara Lokesh YuvaGalam Padayatra) విజయవంతంగా దూసుకుపోతోంది. 185 రోజులుగా లోకేశ్ (TDP Leader) ప్రజల్లో తిరుగుతూ వారి సాదకబాదకాలు వింటూ టీడీపీ (TDP) అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం లోకేశ్ (Young Leader) గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈనెల 19న మధ్యాహ్నం ఒంటిగంటకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి (Krishna District) నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది. ఈ మేరకు కృష్ణా జిల్లాలో పాదయాత్ర షెడ్యూల్ వివరాలను టీడీపీ సీనియర్ నేత కేశినేని శివనాథ్(చిన్ని) (TDP Senior Leader Kesineni Shivanath(Chinni)) మీడియాకు తెలియజేశారు. 19, 20, 21 తేదీలలో మూడు రోజులు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పాదయాత్ర కొనసాగనుంది. 19న విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్‌లో, 20న విజయవాడ తూర్పు, పెనమలూరులో, 21న గన్నవరం పర్యటించనున్నారు. లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏర్పాట్లు పూర్తి అయినట్లు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.


మంగళగిరిలో దుమ్మురేపేశారు..

మరోవైపు నిన్న (మంగళవారం) మంగళగిరిలో 185వ రోజు పాదయాత్ర దుమ్మురేపింది. సొంతగడ్డపై ప్రజల నుంచి అపూర్వస్పందన లభించింది. మంగళగిరి మండలం నిడమర్రు నుంచి 185వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. జాతీయ జెండా చేతబట్టి లోకేశ్ పాదయాత్ర చేశారు. అడుగడగునా యువనేతకు దిష్టితీస్తూ, హారతులు పడుతూ మహిళలు నీరాజనాలు పలుకుతున్నారు. లోకేశ్‌ పాదయాత్రకు సంఘీభావంగా మంగళగిరి ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో యువనేతపై అభిమానాన్ని చాటుకున్నారు. యువనేతను చూసేందుకు రోడ్లవెంట జనం బారులు తీరారు. ఫోటోలు దిగేందుకు యువతీయువకులు పోటీపడ్డారు. యువనేత పాదయాత్రతో మంగళగిరి ప్రధాన రహదారి జనసంద్రంగా మారింది. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు వింటూ యువనేత ముందుకు సాగారు.

Updated Date - 2023-08-16T10:48:27+05:30 IST