MLC Ashok Babu: ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి సూచనతోనే పోలింగ్ బూత్‌లు మార్చారు
ABN , First Publish Date - 2023-10-17T16:09:14+05:30 IST
ఫ్యాక్షన్ ప్రాంతమైన గురజాల నియోజకవర్గం( Gurjala Constituency )లో స్థానిక ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి ( MLA Kasu Mahesh Reddy ) సూచనతోనే అధికారులు 6 గ్రామాల్లో 18 పోలింగ్ బూత్‌లను ప్రతిపక్షాలతో సంప్రదించకుండానే మార్చారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ( MLC Paruchuri Ashok Babu ) అన్నారు.
అమరావతి: ఫ్యాక్షన్ ప్రాంతమైన గురజాల నియోజకవర్గం( Gurjala Constituency )లో స్థానిక ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి ( MLA Kasu Mahesh Reddy ) సూచనతోనే అధికారులు 6 గ్రామాల్లో 18 పోలింగ్ బూత్‌లను ప్రతిపక్షాలతో సంప్రదించకుండానే మార్చారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ( MLC Paruchuri Ashok Babu ) అన్నారు. ఏపీలో ఇష్టానుసారం జరుగుతున్న పోలింగ్ బూత్‌ల మార్పుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు, భూమిరెడ్డి రామ్ గోపాల్‌రెడ్డి మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పిన్నెల్లిలో ఒకేచోట 9 బూత్‌లు ఏర్పాటు చేశారు. అది ఎలా సాధ్యమైందంటే అధికారులు సమాధానం చెప్పడంలేదు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు.. నిబంధనలు ఏవీ క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలుకావడం లేదు. తాము లేవనెత్తిన అభ్యంతరాలు పరిశీలిస్తామని, కొత్త ఓటరు జాబితా వచ్చాక సమస్య పరిష్కారంపై దృష్టిపెడతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్పారు. పోలింగ్ బూత్‌ల మార్పుపై ఏపీ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోకుంటే, కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయిస్తాం. పోలింగ్ బూత్‌లు మార్చేసి, ఇష్టానుసారం ఓటింగ్ చేయించుకునే ఆలోచనలు అధికారపార్టీ చేస్తుంటే చూస్తూ ఊరుకోం’’ అని పరుచూరి అశోక్ బాబు తీవ్రంగా హెచ్చరించారు.