Nadendla Manohar: వైసీపీ నేతలకి గడప గడపలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది

ABN , First Publish Date - 2023-10-08T16:17:29+05:30 IST

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, జగన్‌రెడ్డి తప్పుడు ప్రచారాలను ఏపీ ప్రజలు గుర్తించారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) వ్యాఖ్యానించారు.

Nadendla Manohar: వైసీపీ నేతలకి గడప గడపలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది

అమరావతి: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, జగన్‌రెడ్డి తప్పుడు ప్రచారాలను ఏపీ ప్రజలు గుర్తించారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘వైసీపీ నేతలను నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం లక్కనపల్లెలో ఎమ్మెల్యే అవీనితిపై ప్రశ్నించిన జనసేన పార్టీ నాయకుడు మధుసూదన్‌పై దాడి చేయడం అప్రజాస్వామికం. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లోని తప్పులను గుర్తించి.. అడగటమే ఆ బాధితుడు చేసిన తప్పా? వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులు బయటపడుతున్నాయి కాబట్టే అసహనంతో దాడులు చేస్తున్నారు. ఈ విషయాన్ని గడప గడపకు దాడులు అనే కార్యక్రమంలా మార్చేశారు. పోలీసులు తక్షణమే స్పందించి.. మధుపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. వైసీపీ నేతలకి గడప గడపలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించేటప్పుడు టీడీపీ జనసేన నేతలను గృహ నిర్బంధాలు చేస్తున్నారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-08T16:17:29+05:30 IST