Balakrishna: నియంత పాలనకు బుద్ధి చెబుదాం

ABN , First Publish Date - 2023-09-12T18:45:34+05:30 IST

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)పై కక్ష తీర్చుకోవడానికే జగన్‌రెడ్డి ఈ కేసులు పెట్టించారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(MLA Nandamuri Balakrishna) అన్నారు.

Balakrishna:  నియంత పాలనకు బుద్ధి చెబుదాం

విజయవాడ: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)పై కక్ష తీర్చుకోవడానికే జగన్‌రెడ్డి ఈ కేసులు పెట్టించారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(MLA Nandamuri Balakrishna) అన్నారు. మంగళవారం నాడు ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబుతో నేను అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ..‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ధైర్యంగా ఉండాలి. నియంత పాలనకు పోరాటాల ద్వారా బుద్ధి చెప్పాలి.ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు.స్కిల్ డెవలప్మెంట్(Skill development) ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించారు.ఈ స్కీంలో.. స్కాం జరిగిందని రాజకీయంగా కుట్ర చేశారు.జగన్ తన వైఫల్యాల నుంచే డైవర్టు చేయడానికే ఈ అరెస్టు చేశారు. నిజంగా అవినీతి జరిగి ఉంటే... అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు.ఏ సీఎం అయినా పాలసీ మేకర్‌గా నిర్ణయం తీసుకుంటారు.అంతమాత్రాన అన్నీ అధినేతకు తెలియాలని లేదు.హేమచంద్రరెడ్డి, ఇతర అధికారులు ఈ నిధులు ఇచ్చారు.సీమన్స్ సంస్థ మెజార్టీ వాటా పెట్టగా, ప్రభుత్వం పది శాతమే కేటాయించింది. 340 కోట్లు పెద్ద స్కాం అని ఈ అవినీతి పరులు చెబుతున్నారు.జగన్మోహన్‌రెడ్డి మీద 31 కేసులు ఉన్న విషయం మరచిపోతే ఎలా..? ఆ కేసులు కొట్టేయలేదు... బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు.


పదేళ్ల నుంచీ ఈ కేసులు కోర్టులో సాగుతున్నాయి. జగన్మోహన్‌రెడ్డి(Jagan Reddy) దుర్మార్గుడు అంటూ కాంగ్రెస్ ఆ కేసులు వేసింది. నేను 16 నెలలు జైల్లో ఉన్నా కాబట్టి, చంద్రబాబు కూడా జైల్లో ఉండేలా జగన్‌రెడ్డి పగ బట్టారు.చంద్రబాబు, లోకేష్‌లకు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేక పోతున్నారు.కార్మికులు కష్టం, ఆడపడుచుల. ఆశీర్వాదంతో తెలుగుదేశం పుట్టింది. ఎన్టీఆర్‌, చంద్రబాబు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారుటీడీపీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడింది.జగన్ ఎన్ని కుట్రలు చేసినా ఏమీ చేయలేడు.యువత నిరుద్యోగ సమస్యతో మత్తుకు బానిస అవుతున్నారు.జగన్ ఇచ్చిన హామీల అమలుపై దమ్ముంటే మాట్లాడాలి. మన ఉద్యమం, పోరాటాల్లో అందరూ భాగస్వామ్యం కావాలి.రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేశారు.ప్రపంచ పటంలో ఏపీకి ఉనికే లేకుండా చేశారు.మనం ఆంధ్రులమని చెప్పుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారు తెలంగాణకు ధీటుగా ఏపీని చంద్రబాబు అభివృద్ధి చేశారు.జగన్ వచ్చాక జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారు.పన్నుల భారాలు, విద్యుత్ ఛార్జీలు పెంపుతో ప్రజలను దోచేస్తున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు, సమయం వచ్చినప్పుడు జగన్‌కి తప్పకుండా బుద్ధి చెబుతారు.వైసీపీ ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించండి. ఈ సైకో సీఎంని ఓడించేలా అందరూ కలిసి పని చేయాలి’’ అని నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు.

Updated Date - 2023-09-12T18:45:34+05:30 IST