Panchumurti Anuradha: ఆశావర్కర్లు అధిక పని ఒత్తిడికి గురువుతున్నారు
ABN , First Publish Date - 2023-10-08T19:51:35+05:30 IST
ఆశావర్కర్లు అధిక పని ఒత్తిడికి గురువుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు పంచుమర్తి అనురాధ(Panchumurti Anuradha) వ్యాఖ్యానించారు.
అమరావతి: ఆశావర్కర్లు అధిక పని ఒత్తిడికి గురువుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు పంచుమర్తి అనురాధ(Panchumurti Anuradha) వ్యాఖ్యానించారు. ఆశావర్కర్ కృపమ్మ కుటుంబాన్ని ఆదివారం నాడు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, మాజీ మంత్రి పీతల సుజాత, రాష్ట్ర మహిళ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనురాధ మీడియాతో మాట్లాడుతూ..‘‘తాడేపల్లి ఆశావర్కర్ రేపూడి కృపమ్మ కుటుంబానికి నారా లోకేష్ రూ. 2 లక్షల ఆర్థిక సహాయం చేశారు. టీడీపీ, సీఐటీయూ రెండు రోజుల నిరసనతోనే జగన్‌రెడ్డి ప్రభుత్వం దిగి వచ్చింది. ఆశావర్కర్లు దేవుళ్లతో సమానం. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోయిన అధిక పని ఒత్తిడి కారణంగానే కృపమ్మ మృతి చెందారు. నారా లోకేష్ బాధలో ఉన్నప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటున్నారు. సరైన ట్రైనింగ్ ఇవ్వకుండా ఆశావర్కర్లను ఒత్తిడికి గురి చేస్తున్నారు. అరకొర జీతాలు ఇస్తూ అశావర్కర్లకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న నవరత్నాలను ఇవ్వడం లేదు. వైసీపీ పథకాలు అందక అరకొర జీతాలతో ఆశావర్కర్లు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆరోగ్య సురక్ష పేరుతో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న బీపీ, షుగర్ మందులే ఇస్తున్నారు’’ అని అనురాధ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.