Pattabhiram: ఇసుకదోపిడిపై జగన్ సమాధానం చెప్పాలి
ABN , First Publish Date - 2023-08-29T15:54:50+05:30 IST
రాష్ట్రంలో జరుగుతున్న ఇసుకదోపిడి(sand robbery)కి సంబంధించి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) సంధించిన ప్రశ్నలకు ఇసుకాసురుడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan) ఎందుకు సమాధానం చెప్పడం లేదు? అని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్(Kommareddy Pattabhiram0 ప్రశ్నించారు.
అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న ఇసుకదోపిడి(sand robbery)కి సంబంధించి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) సంధించిన ప్రశ్నలకు ఇసుకాసురుడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan) ఎందుకు సమాధానం చెప్పడం లేదు? అని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్(Kommareddy Pattabhiram0 ప్రశ్నించారు. మంగళవారం నాడు పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ క్వార్టర్లీ ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్టులపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడు?రాష్ట్రంలో ఇసుక తవ్వకాలతో తమకేం సంబంధంలేదని, ఊరూపేరులేని మరో పార్టీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చామని, ఈ విషయం ఏపీ ప్రభుత్వానికి కూడా తెలుసంటున్న జేపీ వెంచర్స్ సంస్థ రిపోర్టులపై ఇసుకాసురుడు నోరు విప్పాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సబ్ కాంట్రాక్టర్ల వివరాలు అన్ని తెలుసని, సదర్ సబ్ కాంట్రాక్టర్ ప్రభుత్వానికి జూన్ 30, 2023 నాటికి రూ.302.45 కోట్లు బకాయి పెట్టాడంటున్న జేపీ పవర్ వెంచర్స్ రిపోర్ట్‌లోని సమాచారంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి.
రూ.302 కోట్లు ప్రభుత్వానికి ఎగనామం పెట్టిన సదరు జగన్ బినామీ ఎవరు? తాము ఎవరెవరికి, ఎక్కడెక్కడ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చామనే వివరాలను డీఎంజీ (డైరెక్టరేట్ ఆఫ్ మైనింగ్ అండ్ జియాలజీ) వారికి తెలుసంటున్న జేపీ వెంచర్స్ ఫైనాన్షియల్ రిపోర్ట్ నిజమా..కాదా? ఇన్నాళ్లు రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ మాత్రమే చేపడుతోందని బుకాయించిన జగన్, నేడు ఈ సబ్ కాంట్రాక్టర్ల వ్యవహారాన్ని ఎలా సమర్థించుకుంటాడు? ఇంకా ఎవరిని మోసగించడానికి ప్రభుత్వం జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ పేరుతో ఇసుకతవ్వకాలకు సంబంధించి దొంగ బిల్లులు ఇస్తోంది?తక్షణమే ప్రభుత్వం వద్ద ఉన్న ఇసుక సబ్ కాంట్రాక్టర్ల వివరాలన్నీ ప్రజల ముందు ఉంచాలి ఊరూపేరు లేని సబ్ కాంట్రాక్టర్ ఎవరు.. ఆ పేరుతో జగన్ ఇసుక మాఫియా ఈ నాలుగేళ్లలో ఎన్ని రీచ్‌లలో ఎంతెంత ఇసుక తవ్వింది? రాష్ట్రంలోని సహజవనరులన్నింటినీ మింగేస్తున్న జగన్ కేవలం ఇసుకద్వారానే రూ.40వేలకోట్లు దోచేశాడన్నది పచ్చి నిజం. రాష్ట్రంలోని ఇసుకను ఇతర రాష్ట్రాల్లో అమ్ముకుంటూ, సబ్ కాంట్రాక్టర్ల ముసుగులో దోపిడీ చేస్తున్నాడు కాబట్టే ఇసుకాసురుడు జగన్ , టీడీపీ అధినేత ప్రశ్నలపై నోరు విప్పడంలేదు’’ అని పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.