Purandeswari: పవన్ వ్యాఖ్యలపై ఏమన్నారంటే..?

ABN , First Publish Date - 2023-10-03T21:34:41+05:30 IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేసే ప్రతి కామెంటుపై తాను స్పందించాల్సిన అవసరం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి(Purandeswari) వ్యాఖ్యానించారు.

Purandeswari: పవన్ వ్యాఖ్యలపై ఏమన్నారంటే..?

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేసే ప్రతి కామెంటుపై తాను స్పందించాల్సిన అవసరం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి(Purandeswari) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో కోర్ కమిటీ సమావేశం అయింది. ఈసమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈసందర్భంగా పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ..‘‘పొత్తులపై పవన్ ప్రకటన.. ఆయన అభిప్రాయాలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం. పొత్తులు.. పవన్ కామెంట్ల విషయంలో జాతీయ పార్టీ సూచనల మేరకు వ్యవహరిస్తాం. ప్రస్తుతం పవన్‌తో పొత్తు కొనసాగుతుందా..? లేదా..? అనే అంశం పైనా జాతీయ నాయకత్వమే చెప్పాలి. పొత్తులపై పవన్ తన అభిప్రాయాన్ని చెప్పారు. మా అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వమే చెబుతుంది. మాది ప్రాంతీయ పార్టీ కాదు.. జాతీయ పార్టీ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు సందర్భంగా సేవా పక్షోత్సవాల ఎలా జరిగాయనే అంశంపై విశ్లేషించుకున్నాం. ఆయుష్మాన్ భారత్ కార్డులు 10596 కార్డులను పేదలకు పంపిణీ చేశాం. మండల ప్రవాస్ కార్యక్రమంలో భాగంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేశాం. త్వరలో రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరుగుతుంది.. జేపీ నడ్డా హాజరవుతారు. మద్యం మీద, గ్రామ పంచాయతీ రాజ్ సంస్థల నిధులను మళ్లింపుపై ఆందోళనలు చేపట్టాం. కేంద్ర బృందం వచ్చి.. నిధుల మళ్లింపుపై విచారణ చేపట్టింది. ఏపీలో స్థానిక సంస్థల నిధుల మళ్లింపు జరిగిందని కేంద్ర బృందం నిర్దారణకు వచ్చింది’’ అని పురంధేశ్వరి పేర్కొన్నారు.

Updated Date - 2023-10-03T21:34:41+05:30 IST