TDP: వైఎస్ వివేకా కేసులో అసలు ముద్దాయి ఎవరో చెప్పిన టీడీపీ నేత
ABN , First Publish Date - 2023-04-20T10:35:31+05:30 IST
ఏపీలోనే కాకుండా తెలుగు వారు ఎక్కడ ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు.
గుంటూరు: ఏపీలోనే కాకుండా తెలుగు వారు ఎక్కడ ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Nakka Anandbabu) పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు (Former Minister Nakka Anand babu) తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... వచ్చే ఏడాది ఈ సమయానికి దుర్మార్గ పాలన అంతం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ కార్యకర్తలు ఈ ఏడాదంతా సైనికుల మాదిరిగా కష్టపడాలని పిలుపునిచ్చారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు దేనికైనా సిద్ధంగా ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని పరీక్షల్లో అడిగితే రాయలేని పరిస్థితి నెలకొందన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి.. ప్రజల లెంపకాయలు వాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని చంపించింది జగన్ (YS Jaganmohan Reddy) అని పులివెందుల, కడప జిల్లా ప్రజలకు ఏనాడో తెలుసన్నారు. హత్య కేసు విచారణ సరిగా జరగటం లేదని సునీత సీబీఐ విచారణ కోరారని తెలిపారు. భాస్కర్ రెడ్డి (Bhaskar Reddy), అవినాష్‌రెడ్డి (Avinash Reddy) కాదు అసలు ముద్దాయి జగన్ రెడ్డి (AP CM) అని... అందుకే కేంద్రం చుట్టూ చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. వివేకా కేసు విచారణ నుంచి ప్రజల దృష్టిని మరల్చటం కోసమే విశాఖలో కాపురం అంటున్నారన్నారు. ఇప్పుడు ఎక్కడైనా కాపురం పెట్టుకో.. ఎన్నికల తర్వాత తమరు కాపురం ఎక్కడ ఉండాలో ప్రజలు తేలుస్తారని వ్యాఖ్యలు చేశారు.
కోడికత్తి వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ అడిగారని... ఇప్పుడు ఎన్ఐఏ విచారణకు పిలిస్తే వెళ్ళటం లేదన్నారు. కోడికత్తి వ్యవహారంలో జగన్ కుట్ర బయటకు రావాలన్నారు. కోడికత్తి శ్రీను నాలుగేళ్లుగా జైల్లో మగ్గుతున్నాడని.. దళిత యువకుడిని జైల్లో ఉంచి ఇబ్బంది పెడుతున్నారని నక్కా ఆనంద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.