TDP Leader: ఒలింపిక్స్‌లో జూదం నిర్వహిస్తే ఏపీ అగ్రస్థానంలో ఉంటుందేమో... టీడీపీ నేత యెద్దేవా
ABN , First Publish Date - 2023-06-15T12:50:31+05:30 IST
జూదంలేని రాష్ట్రంగా చేశామని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రగల్భాలు పలికారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఈరోజు ఒలింపిక్స్‌లో జూదం నిర్వహిస్తే ఏపీ అగ్రస్థానంలో ఉంటుందని యెద్దేవా చేశారు. 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ఉందన్నారు. సీనియర్ సిటిజన్స్ క్లబ్‌లను మాత్రం మూసేశారన్నారు.
పల్నాడు: జూదంలేని రాష్ట్రంగా చేశామని అసెంబ్లీలో సీఎం జగన్ (AP CM YS Jaganmohan Reddy) ప్రగల్భాలు పలికారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Former Minister Prattipati Pullarao)విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఈరోజు ఒలింపిక్స్‌లో జూదం నిర్వహిస్తే ఏపీ అగ్రస్థానంలో ఉంటుందని యెద్దేవా చేశారు. 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ఉందన్నారు. సీనియర్ సిటిజన్స్ క్లబ్‌లను మాత్రం మూసేశారన్నారు. అనధికారికంగా మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్‌లు నడుస్తున్నాయని ఆరోపించారు. చిలకలూరిపేట పేకాటకు అడ్డాగా మారిందన్నారు. చిలకలూరిపేటలోని అపార్ట్‌మెంట్లలో జోరుగా జూదం నడుస్తుందని అన్నారు. సగటును రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు సంపాదిస్తున్నారని తెలిపారు.
పేకాట క్లబ్‌లోనే మద్యం సహా అన్నీ సరఫరా చేస్తున్నారన్నారు. కంటిచూపు మేరలో ఉన్న చిలకలూరిపేటలో జరిగేది సీఎంకు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. సీనియర్ సిటిజన్స్ ఆడుకునే క్లబ్‌లు మూసేసి అనధికారికంగా పేకాట క్లబ్‌లు తెరిచారన్నారు. పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని.. మహిళల తాళిబొట్లు తెగిపోతున్నాయని అన్నారు. సీఎం జగన్, మంత్రి విడదల రజని పుణ్యాన ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయన్నారు. విడదల రజని మహిళా మంత్రిగా ఉండి మహిళల తాళిబొట్లు తెంచుతున్నారని ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.