పల్నాడు జిల్లాలో జరిగిన ఫ్యామిలీ మర్డర్ మిస్టరీ వీడింది.. చంపిందెవరంటే..!
ABN , First Publish Date - 2023-07-06T16:51:17+05:30 IST
ఖాసీం ముందుగా తన కొడుకు జాకీర్‌ను వెంట పెట్టుకుని రెహ్మాన్‌ను సత్తెనపల్లి శివారులో గొంతు నులిమి చంపేశారు. అనంతరం ధూళ్లిపాళ్ల గ్రామానికి వెళ్లి రహీమూన్, మాలింబిని బలమైన ఆయుధంతో కొట్టి హత మార్చారు. అనంతరం స్కూటీలో కొడుకు జాకీర్‌తో కలిసి ఖాసీం పరారయ్యాడు.
పల్నాడు: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్ల గ్రామంలో జరిగిన కుటుంబం హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆస్తి కోసమే ఖాసీం, అతని కుమారుడు జాకీర్ ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. పెదమీరా సాహెబ్, చినమీరా సాహెబ్ అన్నదమ్ములు. కొంతకాలం క్రితం ఇద్దరూ చనిపోయారు. పెదమీరా సాహెబ్‌కు భార్య షేక్ రహీమూన్ (66), కుమార్తె షేక్ మాలింబి (36), కుమారుడు షేక్ రెహ్మాన్ (38) ఉన్నారు. వీరంతా కలిసి జీవిస్తున్నారు. రెహ్మాన్ సత్తెనపల్లిలోని ఓ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. వీరి పేరుపై ఉన్న రెండెకరాల పొలం, ఇల్లు అక్రమంగా పొందాలని బంధువు ఖాసీం కుట్ర పన్నాడు. ముగ్గురిని చంపి వాటిని పొందాలని హత్యకు ప్లాన్ వేశాడు.
మర్డర్ ప్లాన్ ఇలా..
ఖాసీం ముందుగా తన కొడుకు జాకీర్‌ను వెంట పెట్టుకుని రెహ్మాన్‌ను సత్తెనపల్లి శివారులో గొంతు నులిమి చంపేశారు. అనంతరం ధూళ్లిపాళ్ల గ్రామానికి వెళ్లి రహీమూన్, మాలింబిని బలమైన ఆయుధంతో కొట్టి హత మార్చారు. అనంతరం స్కూటీలో కొడుకు జాకీర్‌తో కలిసి ఖాసీం పరారయ్యాడు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ఎస్పీ వెల్లడించారు. ఈ హత్యలో ఖాసీం కొడుకు జాకీర్ పాత్ర కూడా ఉందని తెలిపారు.