Pitani Satyanarayana: స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు పాత్రపై ఆ టీడీపీ నేత ఏమన్నారంటే..?

ABN , First Publish Date - 2023-09-09T16:53:43+05:30 IST

స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌పై(Skill Development Project) మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పితానీ సత్యనారాయణ(Pitani Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)ను అక్రమ అరెస్ట్‌ను పితానీ ఖండించారు.

Pitani Satyanarayana: స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు పాత్రపై ఆ టీడీపీ నేత ఏమన్నారంటే..?

అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌పై(Skill Development Project) మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పితానీ సత్యనారాయణ(Pitani Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)ను అక్రమ అరెస్ట్‌ను పితానీ ఖండించారు. ఈ సందర్భంగా శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ నిబంధనల ప్రకారమే జరిగాయి. ఈ అంశంలో ఎక్కడా చంద్రబాబు పేరు లేదు. రెండు ఉన్నత స్థాయి కమిటీలు నియమించి వారు సిఫార్సు మేరకే ప్రాజెక్ట్ అమలు చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామ్యకం , సీఎం జగన్‌రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలు మాత్రమే. ఎలాంటి కేసులు లేకుండా లేకుండా అరెస్టు చేయడం ఏమిటి? అరెస్టు చేసిన తర్వాత ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఎక్కడో నమోదయిందని చెప్పడమేమిటి..? మాకు న్యాయపరమైన హక్కులు లేవా? ఇలా రహస్యంగా కేసు నమోదు చేసి అర్ధరాత్రి హంగామా చేయటం ఏమిటి?

రాష్ట్రాన్ని ఒక పెద్ద దోపిడీదారుడు పరిపాలిస్తున్నాడు ప్రతిపక్ష నాయకుడు పైన బురద జల్లుతున్నాడు. లండన్‌లో ఉన్న జగన్ పక్క స్క్రీన్‌ప్లేతో ఇదంతా నడిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తున్నారని జగన్‌కు అర్థమైపోయింది. ప్రజానాడీ సీఎం జగన్‌కు తెలిసిపోయింది. అందుకే చంద్రబాబును అరెస్టు చేశారు. జగన్ ప్రభుత్వం పని అయిపోయింది... దిగజారుడు పనులు చేస్తున్నారు’’ అని పితానీ సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-09T16:54:31+05:30 IST