Viveka Case : కడప వివేక హత్య కేసులో కీలక పరిణామం.. ఈసారి ఏకంగా..

ABN , First Publish Date - 2023-04-14T11:01:10+05:30 IST

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ కేసు త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. నేడు సీబీఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి మరొకరిని అరెస్ట్ చేశారు.

Viveka Case : కడప వివేక హత్య కేసులో కీలక పరిణామం.. ఈసారి ఏకంగా..

కడప : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ కేసు త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. నేడు సీబీఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో సుదీర్ఘంగా విచారణ జరిపిన సీబీఐ అధికారులు.. నేడు పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేశారు. గూగుల్ టేక్ ఔట్ సమాచారం ఆధారంగా సీబీఐ విచారణ నిర్వహించింది. వివేకా హత్య రోజు నిందితులతో కలిసి ఉదయ్ కుమార్ రెడ్డి తిరిగినట్టు అధికారులు గుర్తించారు. హత్యలో ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. తన కుమారుడు అర్ధరాత్రి వరకు ఇంటికి రాకుండా నిందితులతో తిరిగాడని ఉదయ్ తల్లి బహిరంగంగా చెప్పారు.

గత సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై ఉదయ్ కుమార్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో తనని వేధింపులకు గురిచేస్తున్నాడని రామ్ సింగ్ పై ఆరోపణలు చేశాడు. వైఎస్ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్లో ఉదయ్ తండ్రి ప్రకాశ్ రెడ్డి కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు. ఈసీ గంగిరెడ్డి ఆదేశాలతో వైఎస్ వివేక మృతదేహానికి ప్రకాష్ రెడ్డి కుట్లు వేసినట్టు తెలుస్తోంది. సునీల్ బెయిల్ పిటిషన్ కౌంటర్‌లో ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి పాత్రలను సీబీఐ వెల్లడించింది. ఉదయ్‌ను కడప నుంచి హైదరాబాద్‌కి అధికారులు తరలిస్తున్నారు. హైదరాబాద్‌లో మేజిస్ట్రేట్ ముందు ఉదయ్‌ను సీబీఐ హాజరు పరుచునుంది.

Updated Date - 2023-04-14T11:01:10+05:30 IST